1. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ కార్పొరేషన్‌కు (IRCTC) చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, తిరుచ్చిరాపల్లి లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొదటి రోజు టూర్ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. టూరిస్టులు ఉదయం 5.35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10 గంటలకు త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత జటాయు ఎర్త్ సెంటర్ సందర్శన ఉంటంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకోవాలి. రాత్రికి త్రివేండ్రమ్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రెండో రోజు తెల్లవారుజామున శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి. దారిలో పద్మనాభపురం ప్యాలెస్ చూడొచ్చు. సాయంత్రం సన్‌సెట్ పాయింట్లో సూర్యాస్తమయాన్ని వీక్షించొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. మూడో రోజు ఉదయం రాక్ మెమోరియల్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత రామేశ్వరం బయల్దేరాలి. సాయంత్రం రామేశ్వరం చేరుకుంటారు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నాలుగో రోజు ధనుష్కోడికి వెళ్లొచ్చు. పర్యాటకులు సొంత ఖర్చులతోనే ధనుష్కోడికి వెళ్లాలి. ఆ రోజంతా రామేశ్వర ఆలయాన్ని సందర్శన ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. ఐదో రోజు ఉదయం మదురై బయల్దేరాలి. మదురైలో మీనాక్షి ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం తిరుచ్చికి బయల్దేరాలి. రాత్రికి తిరుచ్చిలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.28750, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29800, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.39100 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)