1. తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. వారం రోజుల్లో తమిళనాడులోని ఆలయాలను చూపించనుంది. తమిళనాడులో గొప్ప రాజవంశాలైన పల్లవులు, చోళులు, పాండ్యులు నిర్మించిన చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ టూరిజం టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీ 2023 ఫిబ్రవరి 5న ప్రారంభం అవుతుంది. ఇది 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో కాంచీపురం, కుంబకోణం, చెన్నై, పుదుచ్చేరి, తంజావూరు, తిరుచ్చి లాంటి ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను ఈ టూర్లో చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐఆర్సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీ 2023 ఫిబ్రవరి 5న హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.10 గంటలకు చెన్నై చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత మహాబలిపురం తీసుకెళ్తారు. మహాబలిపురం టూర్ ముగిసిన తర్వాత రాత్రికి చెన్నైలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐదో రోజు కుంబకోణంలోని ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి కుంబకోణంలో బస చేయాలి. ఆరో రోజు తంజావూర్ బయల్దేరాలి. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుచ్చి బయల్దేరాలి. మధ్యాహ్నం శ్రీరంగం ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుచ్చిలో బస చేయాలి. ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. తిరుచ్చిలో ఉదయం 9.40 గంటలకు బయల్దేరితే ఉదయం 11.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఐఆర్సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.29,750, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.31,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.37,500 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)