1. షిరిడీ వెళ్లాలనుకునే సాయిబాబా భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి షిర్డీకి ఫ్లైట్లో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. షిర్డీ సాయి దర్శన్ విత్ శని శిగ్నాపూర్ (Shirdi Sai Darshan With Shani Shingnapur) పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐఆర్సీటీసీ షిర్డీ సాయి దర్శన్ టూర్ ప్యాకేజీ వీకెండ్లో అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో రెండు రోజులు షిర్డీ టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. షిర్డీతో పాటు శని శిగ్నాపూర్ ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతుంది. ఐఆర్సీటీసీ టూరిజం షిర్డీ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ టూరిజం షిర్డీ టూర్ మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. ఉదయం 10.10 గంటలకు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12.05 గంటలకు షిరిడీ చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత సాయిబాబా దర్శనం ఉంటుంది. పర్యాటకులు సొంత ఖర్చులతో సాయిబాబాను దర్శించుకోవాలి. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఆర్సీటీసీ టూరిజం షిర్డీ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10,510, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,700, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,635 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి షిరిడీలో బస, బ్రేక్ఫాస్ట్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ టూర్ ప్యాకేజీలో ఆలయాల దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, లంచ్, డిన్నర్, హైదరాబాద్లో లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫ్లైట్లో మీల్స్ కవర్ కావు. పర్యాటక స్థలాల్లో ఆటోలు, రిక్షాలు, ఇతర లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తే టూరిస్టులు స్వయంగా డబ్బులు చెల్లించాలి. టూరిస్టులు ఒరిజినల్ ఐడీ కార్డ్స్ తీసుకొని రావాలి. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ పాటించాలి. (ప్రతీకాత్మక చిత్రం)