1. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుమారు ఏడాదిన్నరగా ప్రజలు టూర్లకు వెళ్లలేకపోయారు. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోవడం, అంతా నార్మల్ అవుతుండటంతో మళ్లీ టూర్లకు బయల్దేరుతున్నారు. దీంతో రివేంజ్ టూరిజం (Revenge Tourism) మొదలైంది. ప్రజలు మళ్లీ టూర్లు, షికార్లకు బయల్దేరుతున్నారు. వీరి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. హైదరాబాద్ నుంచి దేశంలోని వేర్వేరు పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. అందులో భాగంగా భూలోక స్వర్గం అయిన కాశ్మీర్ అందాలను చూసేందుకు 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ నవంబర్ 12న ప్రారంభం కానుంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో గుల్మార్గ్, పహల్గమ్, శ్రీనగర్, సోన్మార్గ్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.26,335. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.27,060, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,110 చెల్లించాలి. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు, శ్రీనగర్ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ టికెట్స్, హోటల్లో అకామడేషన్, ఒక రాత్రి హౌజ్ బోట్లో స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. Day 1: ఐఆర్సీటీసీ కాశ్మీర్ టూర్ మొదటి రోజు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రారంభం అవుతుంది. ఉదయం 07:55 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10:30 గంటలకు చండీగఢ్‌లో ఫ్లైట్ దిగుతారు. మధ్యాహ్నం 12:25 గంటలకు చండీగఢ్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1:40 గంటలకు శ్రీనగర్ చేరుకుంటారు. హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత షాపింగ్‌కు వెళ్లొచ్చు. రాత్రికి హోటల్లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Day 2: రెండో రోజు ఉదయం శంకరాచార్య ఆలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్ సందర్శించొచ్చు. ఆ తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్ బల్ క్షేత్రాన్ని సందర్శించాలి. సాయంత్రం పర్యాటకులు సంత ఖర్చులతో దాల్ సరస్సులో షికారా రైడ్‌కు వెళ్లొచ్చు. సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్లోటింగ్ గార్డెన్స్ చార్ చినార్ సందర్శించాలి. రాత్రికి హోటల్లోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. Day 6: ఆరో రోజు ఉదయం హౌజ్‌బోట్ నుంచి చెకౌట్ కావాలి. తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 02:10 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో బయల్దేరితే మధ్యాహ్నం 3:35 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. చండీగఢ్‌లో రాత్రి 7:25 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10:00 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)