1. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో టూర్లకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్నన్ని రోజులు టూర్లకు దూరమయ్యారు. ఇప్పుడు టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. విశాఖపట్నం నుంచి మాతా వైష్ణోదేవీ టూర్ (Mata Vaishno Devi Tour) ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీలో మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శనతో పాటు అమృత్సర్, ధర్మశాల లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మే 22న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. హోటల్లో చెకిన్ అయిన తర్వాత గోల్డెన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రికి అమృత్‌సర్‌లో బస చేయాలి. రెండో రోజు ఉదయం జలియన్‌వాలా బాగ్ సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత వాఘా బార్డర్‌కు వెళ్లొచ్చు. రాత్రికి అమృత్‌సర్‌లో బస చేయాలి. మూడో రోజు ధర్మశాలకు బయల్దేరాలి. రాత్రికి ధర్మశాలలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నాలుగో రోజు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. టిబెటియన్ మొనాస్ట్రీ, క్రికెట్ స్టేడియం, భగ్సునాథ్ ఆలయం సందర్శించొచ్చు. ఐదో రోజు కాట్రాకు బయల్దేరాలి. రాత్రికి కాట్రాలోనే బస చేయాలి. ఆరో రోజు కాట్రాలో వైష్ణో దేవి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కాట్రాకు బయల్దేరాలి. రాత్రికి కాట్రాలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ మాతా వైష్ణోదేవీ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.31,760. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.32,675, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.42,100 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)