1. మధ్యప్రదేశ్లోని ఖజురహో శిల్ప సౌందర్యం చూడాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్' పేరుతో ట్రైన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో (IRCTC Tour Package) మధ్యప్రదేశ్లోని ఖజురహోతో పాటు గ్వాలియర్, ఓర్ఛా లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ టూరిజం హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే ప్రతీ శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసిన పర్యాటకులు శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు కాచిగూడలో, రాత్రి 7.10 గంటలకు కాజిపేటలో సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కొచ్చు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8,760, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,370 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.13,440, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,530 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)