1. కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడఖ్ అందాలను చూడాలనుకునే హైదరాబాద్‌వాసులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి లేహ్ లడఖ్ టూర్ (Leh Ladakh Tour) ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism). హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి అయిన లడఖ్ అందాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అలాంటివారి కోసం ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. జూన్ 16, జూలై 7 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో లేహ్, లడఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, టుర్టుక్, పాంగాంగ్ లాంటి ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ టూరిజం లేహ్ లడఖ్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. 7.05 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1 గంటకు లేహ్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత స్థానికంగా ఉన్న మార్కెట్లో షాపింగ్‌కి వెళ్లొచ్చు. రాత్రికి లేహ్‌లోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రెండో రోజు ఉధయం లేహ్ నుంచి షామ్ వ్యాలీకి బయల్దేరాలి. శ్రీనగర్ హైవేలో సైట్ సీయింగ్ ఉంటుంది. హాల్ ఆఫ్ ఫేమ్, కాలీ మందిర్, గురుద్వార, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్ సందర్శించవచ్చు. రాత్రికి లేహ్‌లో బస చేయాలి. మూడో రోజు లేహ్ నుంచి నుబ్రా బయల్దేరాలి. దారిలో ఖార్దుంగ్లా పాస్ సందర్శించవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత దిక్షిత్, హండర్ విలేజెస్ సందర్శించవచ్చు. సొంత ఖర్చులతో క్యామెల్ సఫారీకి వెళ్లొచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నాలుగో రోజు టుర్టుక్ బయల్దేరాలి. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం గెలుచుకున్న గ్రామం ఇది. టుర్టుక్ వ్యాలీ సందర్శించవచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి. ఐదో రోజు నుబ్రా వ్యాలీ నుంచి పాంగాంగ్ బయల్దేరాలి. పాంగాంగ్ లేక్ సందర్శించవచ్చు. త్రీ ఇడియట్స్ సినిమా షూటింగ్ చేసిన లొకేషన్‌కు వెళ్లొచ్చు. రాత్రికి పాంగాంగ్లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆరో రోజు ఉదయం పాంగాంగ్ సరస్సు దగ్గర సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత లేహ్ బయల్దేరాలి. దారిలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్ సందర్శించవచ్చు. లేహ్‌కు చేరుకున్న తర్వాత షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. రాత్రికి లేహ్‌లో బస చేయాలి. ఏడో రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు లేహ్‌లో బయల్దేరితే రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ టూరిజం లేహ్ లడఖ్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.38,470, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39,080, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.44,025 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, లేహ్‌లో సంప్రదాయ స్వాగతం, ఒక కల్చరల్ షో, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)