1. ప్రతీ ఏటా జరిగే కోణార్క్ డ్యాన్స్ అండ్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ చూడాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కోణార్క్ (Hyderabad to Konark) డ్యాన్స్ అండ్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ (Konark Dance and Sand Art Festival) స్పెషల్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ టూర్ ప్యాకేజీలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, చిలికా లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. డిసెంబర్ 1, 2, 3, 4, 5 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్లైట్ టూర్ ప్యాకేజీ. పర్యాటకుల్ని హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్లి పర్యాటక ప్రాంతాలను చూపించనుంది ఐఆర్సీటీసీ టూరిజం. (ప్రతీకాత్మక చిత్రం)
4. లంచ్ తర్వాత కోణార్క్ బయల్దేరాలి. చంద్రభాగ బీచ్‌లో సైట్‌సీయింగ్ ఉంటుంది. అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్, కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ చూడొచ్చు. ఆ తర్వాత తిరిగి పూరికి బయల్దేరాలి. రాత్రికి పూరీలో బస చేయాలి. రెండో రోజు పూరీలో జగన్నాథ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత చిలికా లేక్ సందర్శన ఉంటుంది. బోట్ రైడ్ చేయొచ్చు. ఐల్యాండ్, ఐరావడ్డీ డాల్ఫిన్ సైట్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మూడో రోజు సాయంత్రం 5.55 గంటలకు భువనేశ్వర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.35 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ కోణార్క్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,955, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,325 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, రెండు రాత్రులు పూరీలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ఎంట్రెన్స్ ఛార్జీలు, కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎంట్రీ టికెట్స్, చిలికా లేక్‌లో బోట్ ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)