1. కేరళ టూర్ వెళ్లాలనుకునే హైదరాబాదీలకు గుడ్ న్యూస్. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి కేరళకు (Hyderabad to Kerala) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ (Kerala Hills and Waters) పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో మున్నార్, అలెప్పీలోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. పర్యాటకుల్ని రైలులో తీసుకెళ్లి ఈ పర్యాటక ప్రాంతాలను చూపించనుంది ఐఆర్సీటీసీ టూరిజం. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. గ్రూప్ బుకింగ్ చేసేవారికి రూ.12,000 లోపే టూర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తుంది ఐఆర్సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ కేరళ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. మంగళవారం మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా ప్రయాణమే ఉంటుంది. రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకుళం టౌన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పర్యాటకుల్ని మున్నార్ తీసుకెళ్తారు. సాయంత్రం మున్నార్‌లో ఖాళీ సమయాన్ని గడపొచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మూడో రోజు ఎరవికుళం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్ సందర్శించవచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. నాలుగో రోజు అలెప్పీ బయల్దేరాలి. బ్యాక్‌వాటర్స్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి అలెప్పీలో బస చేయాలి. ఐదో రోజు ఎర్నాకుళం బయల్దేరాలి. ఎర్నాకుళంలో ఉదయం 11.20 గంటలకు రైలు ఎక్కితే ఆరో రోజు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఆర్సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ ధర చూస్తే గ్రూప్ బుకింగ్ చేసేవారికి ధర తక్కువగా ఉంటుంది. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.11,610, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.13,770 చెల్లించాలి. కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.14,320, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.16,480 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, రైలులో ఫుడ్, సైట్‌సీయింగ్ ప్లేసెస్ దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, బోటింగ్, హార్స్ రైడింగ్, ఇతర యాక్టివిటీస్ లాంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కావు. (ప్రతీకాత్మక చిత్రం)