1. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇండియన్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం సంస్థ అయిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'తిరుపతి దేవస్థానం' పేరుతో ఢిల్లీ నుంచి తిరుపతికి టూర్ ఆపరేట్ చేస్తోంది. ఇది 2 రోజులు, 1 రాత్రి టూర్ ప్యాకేజీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ప్యాకేజీ మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చి వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం, తిరుచానూర్ పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా కలిపే ఉంటుంది. ఇప్పటికే ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తిరుమలకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న శ్రీవారి భక్తుల కోసం మరో ప్యాకేజీ ప్రకటించడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐఆర్సీటీసీ టూరిజం 'తిరుపతి దేవస్థానం' టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే మొదటి రోజు ఉదయం 8.35 గంటలకు పర్యాటకులు ఢిల్లీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కితే 11.30 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్తారు. దారిలో శ్రీకాళహస్తి ఆలయ సందర్శన ఉంటుంది. తిరుపతి చేరుకున్నాక హోటల్లో చెకిన్ కావాలి. ఆ తర్వాత తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. రెండో రోజు ఉదయం భక్తులను తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. చెకౌట్ అయిన తర్వాత చెన్నై విమానాశ్రయానికి బయల్దేరాలి. రాత్రి 7.45 గంటలకు చెన్నైలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10.45 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఆర్సీటీసీ 'తిరుపతి దేవస్థానం' టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.15,660 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.15,800. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.17,710 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, హోటల్లో బస, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, తిరుచానూర్, శ్రీకాళహస్తిలో దర్శనం టికెట్లు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇవే కాకుండా ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తిరుపతికి వేర్వేరు టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. రైల్ టూర్ ప్యాకేజీలతో పాటు ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)