1. శీతాకాలంలో ఊటీ అందాలు చూడాలనుకునే ఆంధ్రప్రదేశ్‌వాసులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) తిరుపతి నుంచి ఊటీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. అల్టిమేట్ ఊటీ (Ultimate Ooty) పేరుతో రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు తిరుపతిలో ప్రారంభం అవుతుంది. రాత్రి 11.55 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీ బయల్దేరాలి. మధ్యాహ్నం ఊటీలో హోటల్లో చెకిన్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ సందర్శించవచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మూడో రోజు ఊటీ లోకల్ టూర్ ఉంటుంది. దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి ఊటీ చేరుకుంటారు. సాయంత్రం వరకు షాపింగ్ చేయొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. ఐదో రోజు ఊటీ నుంచి బయల్దేరాలి. కొయంబత్తూర్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 4.35 గంటలకు రైలు ఎక్కితే అర్ధరాత్రి తిరుపతి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఆర్సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే కంఫర్ట్ ప్యాకేజీ కోసం ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,880, డబుల్ షేరింగ్‌కు రూ.13,780, సింగిల్ షేరింగ్‌కు రూ.25,420 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీ కోసం ట్రిపుల్ షేరింగ్‌కు రూ.9,540, డబుల్ షేరింగ్‌కు రూ.12,450, సింగిల్ షేరింగ్‌కు రూ.24,080 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఏసీ హోటల్లో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, రైలులో భోజనం, సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్లు, బోటింగ్, హార్స్‌రైడింగ్ లాంటివి ప్యాకేజీలో కవర్ కావు. (ప్రతీకాత్మక చిత్రం)