1. మాతా వైష్ణోదేవి టూర్ వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి వైష్ణోదేవి టూర్ (Vaishnodevi Tour) ప్యాకేజీ ప్రకటించింది. స్వదేశ్ దర్శన్ నార్త్ ఇండియా టూర్ పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. 2022 మే 27న ఈ టూర్ ప్రారంభం అవుతోంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మాతా వైష్ణోదేవి ఆలయంతో పాటు ఆగ్రా, మథుర, అమృత్సర్ లాంటి ప్రాంతాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. రైలు మార్గం ద్వారా భక్తులను వైష్ణోదేవి టూర్ తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ. తిరుపతిలో టూర్ ప్రారంభం అవుతుంది. పర్యాటకులు తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్లో ఈ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మూడో రోజు ఉదయం రైలు ఆగ్రాకు చేరుకుంటుంది. ఆగ్రాలో తాజ్మహల్, ఆగ్రా కోట సందర్శించిన తర్వాత మథురకు బయల్దేరాలి. అక్కడ కృష్ణ జన్మభూమిని సందర్శించొచ్చు. నాలుగో రోజు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాకు బయల్దేరాలి. కాట్రా చేరుకున్న తర్వాత దర్శనానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. రాత్రికి కాట్రాలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐదో రోజు వైష్ణో దేవి దర్శనం ఉంటుంది. కాలినడక, పోనీ, డోలీ, హెలికాప్టర్ ద్వారా మాతా వైష్ణోదేవికి వెళ్లొచ్చు. హెలికాప్టర్ సర్వీస్ కావాలనుకుంటే రెండు నెలల ముందుగానే బుకింగ్ చేయాలి. ఆరో రోజు కాట్రా నుంచి బయల్దేరాలి. అమృత్సర్ చేరుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత జలంధర్ బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆరో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఏడో రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది. ఎనిమిదో రోజు పర్యాటకులు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతికి చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ నార్త్ ఇండియా టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.18,120 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.22,165. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేవలం రూ.20,000 లోపు ధరకే మాతా వైష్ణో దేవి టూర్ ప్యాకేజీ అందిస్తుండటం విశేషం. ఈ టూర్ ప్యాకేజీ సదుపాయాలు చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, హోటల్లో వసతి, టీ, కాఫీ, భోజనం, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)