1. కూర్గ్... దక్షిణ భారతదేశంలోని టూరిస్ట్ స్పాట్స్‌లో ఫేమస్ స్పాట్. ఈ హిల్ టౌన్‌ను మడికెరి అని కూడా పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో ఉంటుందీ కొండ ప్రాంతం. కూర్గ్ చుట్టూ అనేక ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడొచ్చు. హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు (Hyderabad to Coorg) ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) టూర్ ప్యాకేజీ అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కాఫీ విత్ కర్నాటక పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో కూర్గ్‌తో పాటు మంగళూరు కవర్ అవుతాయి. ఐదు రోజుల పాటు కూర్గ్ ట్రిప్ (Coorg Trip) ప్లాన్ చేసుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ టూరిజం కాఫీ విత్ కర్నాటక టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు ఉదయం 06:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో కాచిగూడ-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆ రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత మంగళూరు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. పిలికుల నిసర్ఘధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్బావి బీచ్ సందర్శించొచ్చు. రాత్రికి మంగళూరులో బస చేయాలి. మూడో రోజు ఉదయం కూర్గ్‌కు బయల్దేరాలి. కూర్గ్ చేరుకున్న తర్వాత ఓంకారేశ్వర ఆలయం, అబ్బే ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి కూర్గ్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నాలుగో రోజు ఉదయం కావేరీ నిసర్ఘధామ సందర్శించొచ్చు. మధ్యాహ్నం మడికెరి కోట, రాజాస్ సీట్ సందర్శించొచ్చు. రాత్రికి కూర్గ్‌లో బస చేయాలి. ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత తలకావేరీ, భాగమండల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మంగళూరుకు బయల్దేరాలి. మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్లో రాత్రి 8.05 గంటలకు రైలు ఎక్కితే ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఆర్సీటీసీ టూరిజం కాఫీ విత్ కర్నాటక టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,230 కాగా డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,570, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,780 చెల్లించాలి. ఇక కంఫర్ట్ ప్యాకేజీ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,230 కాగా డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,570, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.23,780 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్, అవుతాయి. లంచ్, డిన్నర్, స్నాక్స్ లాంటివి కవర్ కావు. రైలులో ఫుడ్ కూడా ప్రయాణికులు సొంత ఖర్చులతో కొనాల్సి ఉంటుంది. సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్స్ కూడా ప్రయాణికులే కొనాలి. (ప్రతీకాత్మక చిత్రం)