IRCTC Tour: పూరీ, కోణార్క్ వెళ్తారా? ఐదు రోజుల టూర్ ప్యాకేజీ రూ.5,250 మాత్రమే
IRCTC Tour: పూరీ, కోణార్క్ వెళ్తారా? ఐదు రోజుల టూర్ ప్యాకేజీ రూ.5,250 మాత్రమే
IRCTC Bharat Darshan Tourist Train | ఐఆర్సీటీసీ టూరిజం వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి పూరీ, కోణార్క్ టూర్ రూపొందించింది. ఐదు రోజుల టూర్ ప్యాకేజీ ధర రూ.5,250 మాత్రమే. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
1. కరోనా మహమ్మారి లాక్డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత టూర్లకు వెళ్లేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా సుమారు 9 నెలల పాటు టూర్లు, షికార్లకు దూరమైన వారంతా ఇప్పుడు... సమయం దొరికితే ఎక్కడికైనా వెళ్లి సేదతీరేందుకు ఆలోచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
2. మరి మీరు కూడా ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. పూరీ, కోణార్క్, భువనేశ్వర్ లాంటి టూరిస్ట్ ప్రాంతాలు కవర్ అయ్యేలా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఐఆర్సీటీసీ జగన్నాథ్ ధామ్ యాత్ర పేరుతో ఈ ప్యాకేజీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
3. 2021 మార్చి 5న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్లో ఈ టూర్ మొదలవుతుంది. ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ తో పాటు టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ ఆఫీస్, రీజనల్ ఆఫీసుల్లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
4. ఐఆర్సీటీసీ జగన్నాథ్ ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధర రూ.5,250 మాత్రమే. ఇది స్టాండర్డ్ ప్యాకేజీ ధర. ఒకవేళ కంఫర్ట్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే రూ.6,300 చెల్లించాలి. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
5. టూర్ ప్యాకేజీలో స్లీపర్ లేదా థర్డ్ ఏసీ క్లాస్ ప్రయాణం, బస ఏర్పాట్లు, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
6. తెలంగాణలోని సికింద్రాబాద్లో యాత్ర మొదలవుతుంది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడలో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
7. March 5: మార్చి 5న అర్ధరాత్రి 12.05 గంటలకు సికింద్రాబాద్లో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. అదే రోజు దారిలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడలో ఈ రైలు ఆగుతుంది. రాత్రికి పూరీ చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
8. March 6: మార్చి 6న ఉదయం పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కోణార్క్ తీసుకెళ్తారు. అక్కడ సూర్య దేవాలయాన్ని సందర్శించిన తర్వాత తిరిగి పూరీ చేరుకుంటారు. సాయంత్రం పూరీ బీచ్ చూడొచ్చు. రాత్రి భోజనం తర్వాత పూరీలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
9. March 7: మార్చి 7న ఉదయం భువనేశ్వర్ బయల్దేరాలి. భువనేశ్వర్ చేరుకున్నాక లింగరాజ ఆలయం సందర్శిస్తారు. ఆ తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి భువనేశ్వర్ నుంచి బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
10. March 8: మార్చి 8న భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 12
11. March 9: మార్చి 9న భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 12
12. భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు నడిచే వేళల్లో మార్పులు ఉండొచ్చు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్యాకేజీ బుక్ చేసుకునే ప్రయాణికులు సంబంధిత అధికారులను రైలు టైమింగ్స్ వివరాలను అడిగి తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)