1. దేఖో అప్నా దేశ్ ప్రచారంలో భాగంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను పలు రూట్లల్లో నడుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) వేర్వేరు థీమ్స్తో టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర (Baba Saheb Ambedkar Yatra) న్యూ ఢిల్లీ నుంచి ప్రారంభం అవుతుంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రముఖ ప్రదేశాలు, బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా ఉన్న ప్రాంతాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రెండో రోజు ఉదయం 8 గంటలకు మహూ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పుట్టిన ఊరైన మహూ తీసుకెళ్తారు. ఈ ఊరినే భీమ్ జనమ్ భూమి అని పిలుస్తారు. అక్కడ సందర్శన పూర్తైన తర్వాత నాగ్పూర్ బయల్దేరాలి. మూడో రోజు ఉదయం 8 గంటలకు నాగ్పూర్ చేరుకుంటారు. దీక్షా భూమి సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సాంచీ బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ టూరిజం బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర ప్యాకేజీ ధర చూస్తే డబుల్ ఆక్యుపెన్సీ, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.29,440 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, ఏసీ గదుల్లో బస, నాన్ ఏసీ బస్సులో సైట్ సీయింగ్, రైలులో శాకాహార భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)