1. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో (IRCTC) కలిసి భారతీయ రైల్వే ఇటీవల భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో భారత్ గౌరవ్ రైళ్ల ఛార్జీలను తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై ఐఆర్సీటీసీ అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు నుంచి కాశీకి భారత్ దర్శన్ ట్రైన్‌ను ప్రారంభించారు. రూ.20,000 ధరకే వారం రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇక జగన్నాథ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.17,000 పైనే ఉండగా, దక్షిణ్ కీ రామాయణ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.24,000 పైనే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారత్ గౌరవ్ రైళ్ల టూర్ ప్యాకేజీల ధరల్ని 20 శాతం తగ్గించాలని ఐఆర్సీటీసీ ఆలోచిస్తోంది. టికెట్ ఫేర్ తగ్గించడం ద్వారా మరింత మంది పర్యాటకుల్ని ఆకర్షించవచ్చని భావిస్తోంది. ఇదే విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది ఐఆర్సీటీసీ. దీనిపై రైల్వే నిర్ణయం తీసుకున్న తర్వాత భారత్ గౌరవ్ రైళ్ల ఛార్జీలు తగ్గనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రస్తుతం కేవలం మూడు టూర్ ప్యాకేజీలే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీలను ఐఆర్సీటీసీ రూపొందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)