1. రైల్వే ప్రయాణాలు చేసేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అనేక సేవల్ని అందిస్తూ ఉంటుంది. ట్రైన్ టికెట్ బుకింగ్ (Train Ticket Booking) నుంచి కేటరింగ్ వరకు అనేక సేవలు ఐఆర్సీటీసీ నుంచి లభిస్తాయి. అయితే మీరు మీ ఫ్యామిలీతో తరచూ ట్రైన్ జర్నీ చేస్తుంటారా? స్నేహితులు, బంధువులతో కలిసి టూర్లు ప్లాన్ చేస్తుంటారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ సర్వీస్ మీరూ వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. సాధారణంగా ఐఆర్సీటీసీ యూజర్లు నెలలో ఆరు టికెట్ల కన్నా ఎక్కువ బుక్ చేసే అవకాశం ఉండేది కాదు. అంతకన్నా ఎక్కువ టికెట్లు బుక్ చేయాలంటే ఐఆర్సీటీసీ అకౌంట్‌కు (IRCTC Account) ఆధార్ నెంబర్ (Aadhaar Number) లింక్ చేయాలన్న నిబంధన ఉండేది. ఐఆర్సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసినవారికి 12 టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇటీవల ఈ నిబంధనల్ని మార్చి ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించింది. గతంలో ఉన్న లిమిట్‌ను రెట్టింపు చేసింది. కొత్త రూల్స్ ప్రకారం ఐఆర్సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ చేయని ప్రయాణికులు 12 ట్రైన్ టికెట్స్ బుక్ చేయొచ్చు. ఇక ఐఆర్సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసినవారు 24 టికెట్లు బుక్ చేయొచ్చు. మరి ఐఆర్సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐఆర్సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ముందుగా ఐఆర్సీటీసీ పోర్టల్ ఓపెన్ చేయాలి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ప్రొఫైల్ ట్యాబ్ ఓపెన్ చేసి Link Aadhaar పైన క్లిక్ చేయాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆధార్ సంస్థ నుంచి మీ కేవైసీ డీటెయిల్స్ ఐఆర్సీటీసీ అకౌంట్లో అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీ ఐఆర్సీటీసీ అకౌంట్లో 12 ట్రైన్ టికెట్స్ బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీరు, మీ కుటుంబ సభ్యులు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటే ఐఆర్సీటీసీ అకౌంట్లో మాస్టర్ లిస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా మీ ఐఆర్సీటీసీ అకౌంట్లో లాగిన్ కావాలి. My Profile సెక్షన్లో Master List ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీ కుటుంబ సభ్యుల పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. వారి ఆధార్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఆ తర్వాత ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మాస్టర్లిస్ట్లో పేరు యాడ్ అవుతుంది. రైలు టికెట్లు రిజర్వేషన్ చేసే ప్రతీసారి పేర్లు, ఇతర వివరాలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా మాస్టర్ లిస్ట్ నుంచి ప్యాసింజర్ పేరు యాడ్ చేస్తే సరిపోతుంది. తరచూ రైలు ప్రయాణాలు చేసేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)