1. ఐఆర్సీటీసీ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Shri Ramayan Yatra) రైలుకు సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వెజిటేరియన్ సర్టిఫికేషన్ లభించింది. బ్యూరో వెరిటాస్తో కలిసి సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫికేషన్ అందించింది. భారతీయ రైల్వే దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా నడుపుతున్న డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేరియన్ ఫ్రెండ్లీ ట్రైన్ సర్వీస్‌గా గుర్తింపు పొందింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. పూర్తి శాకాహార భోజనాన్ని ప్రమోట్ చేసేందుకు సర్టిఫికేషన్స్ ఇస్తుంటుంది. ఈ సర్టిఫికేషన్ ఐఆర్సీటీసీ శ్రీ రామాయణ యాత్ర రైలుకు లభించింది. ఐఆర్సీటీసీ కిచెన్స్ మాత్రమే కాదు... భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అన్ని రైల్వే స్టేషన్లు, ఎగ్జిక్యూటీవ్ లాంజ్, స్టేషన్ ప్లాట్‌ఫామ్స్‌ను వెజిటేరియన్ ఫ్రెండ్లీగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. భారతదేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే శాకాహారులు, వీగన్ ఆహారపు అలవాట్లు ఉన్న ప్రయాణికులకు ఈ వెజిటేరియన్ ఫ్రెండ్లీ రైలును అంకితం చేసింది భారతీయ రైల్వే. త్వరలో కాట్రాకు వెళ్లే సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా వెజిటేరియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్ లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐఆర్సీటీసీ శ్రీ రామాయణ యాత్ర విశేషాలు చూస్తే రామాయణానికి సంబంధించిన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునేవారి కోసం ఈ రైలును నడుపుతోంది ఐఆర్సీటీసీ. నవంబర్ 7న, నవంబర్ 25న ఈ యాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలో బయల్దేరే రైలు టూర్లో భాగంగా మొదట అయోధ్యలో ఆగుతుంది. అక్కడ శ్రీ రామజన్మభూమి ఆలయం, హనుమాన్ ఆలయం సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. వీటితో పాటు నందిగ్రామ్‌లో భారత్ మందిర్, బీహార్‌లోని సీతామర్హి, జానక్‌పూర్‌లో సీత జన్మస్థలం అయిన రామ్ జానకి ఆలయం, వారణాసి, ప్రయాగ్, శృంగ్వేర్పూర్, చిత్రకూట్ లాంటి ప్రాంతాలను రోడ్డుమార్గంలో సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు నాసిక్ బయల్దేరుతుంది. త్రయంబకేశ్వర్ ఆలయం, పంచవటి ఆలయాన్ని సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. నాసిక్ తర్వాత హంపి, క్రిష్కింద పట్టణాలు సందర్శించవచ్చు. రామేశ్వరం సందర్శన తర్వాత రైలు భద్రాచలానికి వస్తుంది. ఆ తర్వాత రైలు ఢిల్లీ బయల్దేరుతుంది. మొత్తం 17 రోజుల టూర్ ఇది. పర్యాటకులు 7500 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశీయ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రకటించిన దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఐఆర్సీటీసీ ఈ యాత్రను ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఐఆర్సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యాధునిక హంగులు, ఏర్పాట్లు ఉన్నాయి. లగ్జరీ రైలులో ఉండే హంగులన్నీ ఈ రైలులో చూడొచ్చు. ఈ డీలక్స్ లగ్జరీ రైలులో పర్యాటకులు భోజనం చేసేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్ ఉంది. ఇక టూరిస్టులకు కావాల్సినవి వండిపెట్టేందుకు రైలులోనే షెఫ్స్ సిద్ధంగా ఉంటారు. రైలు బెర్త్ చూస్తే హోటల్ గదిలా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)