4. ఐఆర్సీటీసీ రీఫండ్ రూల్స్‌ని 2015 నుంచి అమలు చేస్తోంది. పేపర్‌లెస్ టికెటింగ్‌ని ప్రోత్సహించడం, దుర్వినియోగం చేయడం, ఏజెంట్లను దళారుల ప్రమేయం లేకుండా చేయడం, టికెట్లు బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్లకుండా చూడటం కోసం రీఫండ్ రూల్స్‌ని సవరించింది. 2019 లో రెండు కొత్త రీఫండ్ రూల్స్‌ని యాడ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అన్రిజర్వ్డ్, ఆర్ఏసీ, వెయిట్ లిస్టింగ్‌లో ఉన్న టికెట్లను క్యాన్సిల్ చేస్తే రూ.30, సెకండ్ క్లాస్ (రిజర్వ్డ్), ఇతర క్లాస్‌లకు రూ.60 ఛార్జీలు చెల్లించాలి. రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు కన్ఫామ్డ్ రిజర్వ్డ్ టికెట్లు క్యాన్సిల్ చేస్తే ఏసీ ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌కు రూ.240, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్‌కు రూ.200, థర్డ్ ఏసీకి రూ.180, స్లీపర్ క్లాస్‌కు రూ.120, సెకండ్ క్లాస్‌కు రూ.60 ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఒకవేళ ఆన్లైన్లో టికెట్ క్యాన్సిల్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌కు రీఫండ్ 5 రోజుల్లో వస్తుంది. రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ క్యాన్సిల్ చేస్తే 7 రోజుల్లో రీఫండ్ లభిస్తుంది. ఉపయోగించని రైలు టికెట్లకు రీఫండ్ కావాలనుకుంటే ప్రధాన రైల్వే స్టేషన్లలో స్టేషన్ మాస్టర్లను లేదా మేనేజర్లను సంప్రదించాలి. రీఫండ్ ఇవ్వడం వారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12. పోగొట్టుకున్న రైలు టికెట్లకు రీఫండ్ ఇవ్వరు. చిరిగిన, ముక్కలైన రైలు టికెట్లకు వెరిఫై చేసిన తర్వాత రీఫండ్ ఇస్తారు. ఒకవేళ పోగొట్టుకున్న రైలు టికెట్ కన్ఫామ్ లేదా ఆర్ఏసీ అయితే డూప్లికేట్ పర్మిట్ ట్రావెల్ ఇస్తారు. దీనికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్లు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసినా రీఫండ్ రాదు. ఆ సమయంలో టీడీఆర్ ఫైలింగ్ ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
13. ఒకవేళ ఓ కుటుంబం లేదా బృందం రైలు టికెట్లు బుక్ చేసుకుంటే వారిలో కొందరికి టికెట్లు కన్ఫామ్ అయి, ఇంకొందరికి ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ వస్తే మొత్తం రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినప్పుడు మొత్తం రీఫండ్ వస్తుంది. క్లర్కేజ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇందుకోసం ఆన్లైన్ టీడీఆర్ ఫైల్ చేయాలి. అది కూడా రైలు బయల్దేరడానికి అరగంట ముందు టికెట్లు క్యాన్సిల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)