1. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)... ఈ ప్లాట్‌ఫామ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు రైలు టికెట్లు (Train Ticket Booking) తీసుకోవాలంటే క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ... ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన తర్వాత ఇంట్లో కూర్చొనే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం లభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు టికెట్లు మాత్రమే కాదు... బస్ టికెట్లు, హోటల్ బుకింగ్, టూర్ ప్యాకేజీల బుకింగ్, ఫ్లైట్ టికెట్లు (Flight Ticket Booking) ఇలా అనేక సేవల్ని అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఇందుకోసం వేర్వేరు వెబ్‌సైట్స్, యాప్స్ ప్రారంభించింది. ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే కన్వేయెన్స్ ఫీజ్ అతి తక్కువగా ఉంటుందని ఐఆర్సీటీసీ ప్రకటించింది. (image: IRCTC)
3. ఎయిర్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారి నుంచి కేవలం రూ.50 మాత్రమే కన్వేయెన్స్ ఫీజ్ వసూలు చేస్తున్నట్టు తెలిపింది. ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారికి రూ.50 లక్షల విలువైన ఎయిర్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ (Air Travel Insurance) లభిస్తుందని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఎల్టీసీ టికెట్ బుకింగ్ కోసం తమది ప్రభుత్వ ఆథరైజ్డ్ ఏజెన్సీ అని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ఐఆర్సీటీసీ ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డుతో బుక్ చేస్తే 5 శాతం వ్యాల్యూ బ్యాక్ లభిస్తుందని వివరించింది. కస్టమర్లు ఏ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లో టికెట్స్ బుక్ చేసినా కన్వేయెన్స్ ఫీజు చెల్లించాల్సిందే. ఈ ఫీజు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో వేర్వేరుగా ఉంటుంది. కస్టమర్లు జరిపే చెల్లింపుల ప్రాసెసింగ్ ఖర్చులను కవర్ చేయడానికి కన్వేయెన్స్ ఫీజు వసూలు చేస్తుంటాయి ఈ ప్లాట్‌ఫామ్స్. (image: IRCTC)
5. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రూ.150 వరకు కన్వేయెన్స్ ఫీజు చెల్లించాలి. ఐఆర్సీటీసీ మాత్రం ఫ్లైట్ టికెట్ బుకింగ్‌కు కేవలం రూ.50 కన్వేయెన్స్ ఫీజు మాత్రమే వసూలు చేస్తుండటం విశేషం. గతంలో రైలు టికెట్ బుకింగ్ పైనా ఐఆర్సీటీసీ కన్వేయెన్స్ ఫీజు ఛార్జ్ చేసింది. నాన్ ఏసీ రైలు టికెట్లకు రూ.20 + ట్యాక్స్, ఏసీ టికెట్లకు రూ.40 + ట్యాక్స్ చొప్పున 2016 నవంబర్ 22 వరకు ఐఆర్సీటీసీ కన్వేయెన్స్ ఫీజు వసూలు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అయితే 2019 సెప్టెంబర్ 1 నుంచి నాన్ ఏసీ టికెట్లపై రూ.15 + జీఎస్టీ, ఏసీ టికెట్లపై రూ.30 + జీఎస్టీ చొప్పున వసూలు చేస్తోంది ఐఆర్సీటీసీ. భీమ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే నాన్ ఏసీ టికెట్లకు రూ.15 + జీఎస్టీ, ఏసీ టికెట్లకు రూ.20 + జీఎస్టీ చొప్పున ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)