2. వేసవి వేడిని భరించలేనివాళ్లు అందుకే ఊటీ వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక చలి అంటే ఎక్కువగా ఇష్టమున్నవాళ్లు మాత్రం వింటర్లో ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఐఆర్సీటీసీ ఊటీ హాలిడే ట్రిప్ ప్యాకేజీని రూ.6,000 లోపే బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర ఒకరికి రూ.5860 మాత్రమే. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.7630. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ఇది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఊటీలోని దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్స్, సినిమా షూటింగ్ జరిపే ప్రాంతాలు, పైకారా ఫాల్స్, సిమ్స్ పార్క్, లాంబ్స్ రాక్, ముదుమలై వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, డాల్ఫిన్స్ నోస్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ ప్యాకేజీలో రైలు టికెట్ కవర్ కాదు. రెండు రాత్రులు ఊటీలో అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. కొయంబత్తూర్ నుంచి ఈ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Day 01: ఐఆర్సీటీసీ ఊటీ హాలిడే ట్రిప్ ప్యాకేజీ కొయంబత్తూర్‌లో మొదలవుతుంది. కాబట్టి పర్యాటకులు మొదటిరోజు ఉదయమే కొయంబత్తూర్ చేరుకోవాలి. పర్యాటకుల్ని కొయంబత్తూర్ రైల్వే స్టేషన్లో పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత ఊటీకి రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. ఊటీలోని హోటల్లో చెకిన్ అయిన తర్వాత దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం తీసుకెళ్తారు. ఆ తర్వాత ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్స్ చూడొచ్చు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. Day 02: రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సినిమా షూటింగ్ జరిపే ప్రాంతాలు, పైకారా ఫాల్స్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ముదుమలై వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో విహరించొచ్చు. ముదుమలైలో ఎలిఫెంట్ క్యాంప్, జంగిల్ రైడ్ లాంటివి ఎంజాయ్ చేయొచ్చు. రెండో రోజు రాత్రి కూడా ఊటీలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)