1. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'వెంకటాద్రి-శ్రీపురం' టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, తిరుచానూర్, శ్రీపురం, శ్రీకాళహస్తి ప్రాంతాలను కవర్ చేస్తుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ఇది. ప్యాకేజీ ధర చూస్తే డబుల్ షేరింగ్ అయితే రూ.6800, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.6590. (ప్రతీకాత్మక చిత్రం)
3. థర్డ్ ఏసీ లేదా స్లీపర్ కేటగిరీలో ప్రయాణం, ఏసీ అకామడేషన్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. థర్డ్ ఏసీ బెర్తులు-6, స్లీపర్ బెర్త్‌లు-12 మాత్రమే ఉంటాయి. ప్రతీ శుక్రవారం కాచిగూడ నుంచి టూర్ మొదలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొదటి రోజు శుక్రవారం కాచిగూడలో టూర్ ప్రారంభం అవుతుంది. రాత్రి 08:05 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 07:30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఫ్రెషప్ అయిన తర్వాత కాణిపాకం తీసుకెళ్తారు. ఉదయం 11:30 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కాణిపాకంలో దర్శనం ముగుస్తుంది. అక్కడ్నుంచి శ్రీపురం బయల్దేరాలి. మధ్యాహ్నం 02:00 గంటలకు శ్రీపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 03:45 గంటల్లోగా దర్శనం ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అక్కడ్నుంచి శ్రీకాళహస్తి బయల్దేరతారు. రాత్రి 07:30 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుంటారు. రాత్రి 08:30 గంటల్లోగా దర్శనం ముగుస్తుంది. రాత్రికి శ్రీకాళహస్తిలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మూడో రోజు తిరుమలకు తీసుకెళ్తారు. ఉదయం 09:30 గంటలలోగా తిరుమల చేరుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలి. మధ్యాహ్నం 01:00 గంటల లోగా దర్శనం ముగుస్తుంది. మధ్యాహ్నం 02:00 గంటల వరకు షాపింగ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. మధ్యాహ్న భోజనం తర్వాత 03:30 గంటలకు తిరుపతికి బయల్దేరాలి. సాయంత్రం తిరుచానూర్ ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం 06:30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కితే నాలుగో రోజు ఉదయం 06:20 గంటలకు కాచిగూడకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్సైట్లో చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)