2. 'రిజ్యువెనేటింగ్ కేరళ విత్ హౌజ్‌బోట్ స్టే' పేరుతో ఓ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో టూర్‌తో పాటు హౌజ్‌బోట్ స్టే కూడా ఉంటుంది. ఈ ప్యాకేజీ కొచ్చిన్‌లో ప్రారంభం అవుతుంది. అలెప్పి, కుమారకోమ్, కొచ్చిన్ ప్రాంతాలు చూడొచ్చు. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7,425 మాత్రమే. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,990 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.19,855. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ఇది. ఈ ప్యాకేజీలో ఏసీ వాహనంలో టూర్, ఒక రాత్రి కొచ్చిన్‌లో బస, ఒక రాత్రి అలెప్పి లేదా కుమారకోమ్‌లో హౌజ్‌బోట్‌లో బస, మూడు పూటలు భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్యాకేజీ వివరాలు చూస్తే మొదటి రోజు కొచ్చిన్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకునే కస్టమర్లు మొదటి రోజు టూర్ ప్రారంభమయ్యే సమయానికి కొచ్చిన్ చేరుకోవాలి. పర్యాటకులను ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లేదా కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత అతిరపల్లి తీసుకెళ్తారు. అతిరపల్లి వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత తిరిగి కొచ్చిన్ చేరుకోవాలి. రాత్రికి కొచ్చిన్లోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెకౌట్ కావాలి. కుమారకోమ్ లేదా అలెప్పీ తీసుకెళ్తారు. హౌజ్ బోట్లో చెకిన్ కావాలి. అక్కడే లంచ్ ఉంటుంది. క్రూజ్‌లో బ్యాక్‌వాటర్స్‌లో విహరించొచ్చు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు క్రూజ్ టైమింగ్స్ ఉంటాయి. లంచ్ తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు క్రూజ్ ఉంటుంది. రాత్రికి హౌజ్‌బోట్‌లో బస ఉటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక మూడో రోజు ఉదయం హౌజ్ బోట్ నుంచి చెకౌట్ కావాలి. ఆ తర్వాత కొచ్చిన్ బయల్దేరాలి. హాఫ్ డే కొచ్చిన్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రూజ్ బసిలియా లాంటి ప్లేసెస్ చూడొచ్చు. ఆ తర్వాత ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లేదా కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పర్యాటకులను డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)