2. ప్రతీ మంగళవారం, గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసిలో కాశీ మహాకాళ్ ఎక్స్ప్రెస్ బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు ఇండోర్ చేరుకుంటుంది. రాత్రంతా ప్రయాణించే తొలి ప్రైవేట్ రైలు ఇదే. ఇక ప్రతీ బుధవారం, శుక్రవారం ఉదయం 10.55 గంటలకు ఇండోర్లో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. దారిలో ఉజ్జయిని, సంత్ హీర్దారామ్ నగర్, బీనా, ఝాన్సీ, కాన్పూర్, సుల్తాన్పూర్ స్టేషన్లలో రైలు ఆగుతుంది.
6. కాశీ మహాకాళ్ ఎక్స్ప్రెస్లో కేవలం థర్డ్ ఏసీ-3AC బెర్తులు మాత్రమే ఉంటాయి. వారణాసి-ఇండోర్ మధ్య థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.1,951. ఇందులో నాలుగు మీల్స్ అందిస్తారు. డైనమిక్ ఫేర్ వర్తిస్తుంది. అంటే ముందు బుక్ చేసుకున్నవారికి మాత్రమే రూ.1,951 టికెట్ ధర వర్తిస్తుంది. సీట్లు తగ్గుతున్నకొద్దీ టికెట్ ధర పెరుగుతుంది.