1. కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో లైఫ్ బోర్ కొట్టిందా? కాస్త దూరంగా ఎక్కడికైనా వెళ్లి రిలాక్స్ కావాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఐఆర్సీటీసీ వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందులో భాగంగా కేరళలో టూరిజం బిజినెస్‌ను మళ్లీ ఆపరేట్ చేస్తోంది. వేర్వేరు ప్యాకేజీలను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. పర్యాటకులు మొదటి రోజు ఉదయమే ఎర్నాకుళం లేదా కొచ్చిన్ చేరుకుంటే సైట్ సీయింగ్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. మొదట మున్నార్ తీసుకెళ్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత టీ తోటలను చూపిస్తారు. ఆ తర్వాత మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్ తీసుకెళ్తారు. సాయంత్రం మున్నార్ టౌన్లో షాపింగ్ చేయొచ్చు. రాత్రికి మున్నార్‌లోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. రెండో రోజు ఉదయం మున్నార్‌లో హోటల్ నుంచి చెకౌట్ చేయాలి. ఆ తర్వాత టీ మ్యూజియం తీసుకెళ్తారు. సోమవారం టీ మ్యూజియం మూసివేసి ఉంటుంది. మిగతా రోజుల్లో వెళ్లొచ్చు. ఆ తర్వాత ఎరవికులం నేషనల్ పార్కుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఎర్నాకుళం తీసుకెళ్తారు. సమయం ఉంటే సాయంత్రం సమయంలో మెరైన్ డ్రైవ్ నుంచి బోట్ రైడ్‌కు వెళ్లొచ్చు. రాత్రికి కొచ్చిన్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మూడో రోజు ఉదయం కొచ్చిన్ టూర్ ఉంటుంది. ఉదయం డచ్ ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. డచ్ ప్యాలెస్ శుక్రవారం మూసి ఉంటుంది. మిగతా రోజుల్లో చూడొచ్చు. ఫోర్ట్ కొచ్చిన్తో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు. మధ్యాహ్నం షాపింగ్ చేసుకోవచ్చు. సాయంత్రానికి పర్యాటకులను ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లేదా కొచ్చిన ఎయిర్‌పోర్టులో వదిలేయడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఐఆర్సీటీసీ జాయ్‌ఫుల్ కేరళ టూర్ ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.5,585 మాత్రమే. ఈ ప్యాకేజీలో ఏసీ వాహనంలో మొత్తం టూర్, ఒక రాత్రి మున్నార్‌లో, ఒక రాత్రి కొచ్చిన్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది. మిగతా వాటికి పర్యాటకులు స్వయంగా ఖర్చు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)