రైళ్లలో అధిక లగేజీతో ప్రయాణించవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రజలకు సూచించింది. మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో.. 'ప్రయాణంలో మీ వెంట వస్తువులు ఎక్కువగా ఉంటే ..ఆ ప్రయాణం యొక్క ఆనందం సగం ఉంటుంది! ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణించవద్దు. ఇంకా ఎక్కువ ఉంటే పార్శిల్ ఆఫీసుకి వెళ్లి లగేజీ బుక్ చేసుకోండి’ అంటూ రాసుకొచ్చారు.
ఎంత వరకు అనుమతి అంటే..
ఫస్ట్ క్లాస్ AC లో మీరు ప్రయాణిస్తుంటే.. 70 కిలోల వరకు ఉచితంగా అనుమతించబడుతుంది. AC 2-టైర్ లో.. పరిమితి 50 కిలోలు. AC 3-టైర్ స్లీపర్, AC చైర్ కార్ మరియు స్లీపర్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీ అనుమతించబడుతుంది. సెకండ్ క్లాస్ లో మీరు ప్రయాణిస్తుంటే.. ఈ పరిమితి 25 కిలోల వరకు ఉంటుంది. లగేజీకి కనీస ఛార్జీ రూ.30 ఉంటుంది. 70-80 కిలోల వరకు అదనపు సామాను తీసుకెళ్లడానికి.. ప్రయాణికులు ఇప్పుడు తమ బ్యాగేజీని బుక్ చేసుకోవాలి.