4. Day 1: ఈ ప్యాకేజీ మొదటి రోజు పోర్ట్ బ్లెయిర్‌లో మొదలవుతుంది. కాబట్టి ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ముందుగానే పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకోవాలి. పోర్ట్ బ్లెయిర్ ఎయిర్పోర్ట్ దగ్గర పర్యాటకులను ఐఆర్సీటీసీ ప్రతినిధులు రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌కు తీసుకెళ్తారు. పోర్ట్‌బ్లెయిర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెల్యులార్ జెయిల్‌కు తీసుకెళ్తారు. అక్కడే లైట్ అండ్ సౌండ్ షో చూడొచ్చు. రాత్రి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Day 2: రెండో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత నీల్ ఐల్యాండ్, భరత్ నగర్ బీచ్‌కు తీసుకెళ్తారు. స్విమ్మింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ లాంటివి ఎంజాయ్ చేయొచ్చు. పర్యాటకులు వీటికి సొంతగా ఖర్చు చేయాలి. సాయంత్రం లక్ష్మణ్ పూర్ బీచ్‌లో సూర్యాస్తమయం ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి హోటల్లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. Day 4: నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెకౌట్ చేయాలి. ఆ తర్వాత పర్యాటకులు సొంత ఖర్చులతో ఎలిఫాంటా బీచ్ చూడొచ్చు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనొచ్చు. ఆ తర్వాత హేవ్‌లాక్‌కు క్రూజ్‌లో తిరిగి రావాలి. సాయంత్రానికి పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకెళ్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. Day 5: ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రాస్ ఐల్యాండ్‌కు తీసుకెళ్తారు. చీఫ్ కమిషనర్స్ హౌజ్, గవర్నమెంట్ హౌజ్, చర్చ్, బేకరీ, ప్రెస్, స్విమ్మింగ్ పూల్, సిమెట్రీ లాంటివి చూయిస్తారు. ఆ తర్వా నార్త్ బే ఐల్యాండ్‌కు తీసుకెళ్తారు. అక్కడ ప్రయాణికులు సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనొచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం సమయం కేటాయిస్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)