రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారు మ్యూచువల్ ఫండ్స్ బాట పట్టొచ్చు. దీర్ఘకాలంలో డబ్బులు రెట్టింపు చేసుకోవచ్చు. అయితే రిస్క్ కూడా ఉంటుంది. పెట్టిన డబ్బులు పూర్తిగా తిరిగి రాకపోవచ్చు కూడా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో సగటున 12 శాతం రాబడి అందించాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మ్యూచువల్ ఫండ్స్ అనేవి రూ.10 లక్షలను ఆరేళ్ల కాలంలోనే రూ. 20 లక్షలుగా మార్చొచ్చు. అయితే ఇక్కడ కచ్చితమైన రాబడి ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. రిస్క్ ఉంటుంది.