మీ భార్య పేరును మీరు కొత్త పెన్షన్ స్కీమ్ అకౌంట్ తెరవవచ్చు. ఆమెకు 60 ఏళ్లు దాటాక, మీరు ఒకేసారి పెద్ద మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. అలాగే... నెల నెలా పెన్షన్ బెనెఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ స్కీంలో మీ భార్య ఎంత పెన్షన్ పొందాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఆమెకు 60 ఏళ్లు దాటాక... తన సొంతకాళ్లపై తాను నిలబడే వీలు కలుగుతుంది.
18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న, శాలరీ పొందుతున్న ఉద్యోగులు ఈ అకౌంట్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. టైర్-1, టైర్-2. టైర్-1 అనేది... రిటైర్మెంట్ అకౌంట్, ఇది ప్రభుత్వ ఉద్యోగులందరికీ తప్పనిసరి. టైర్-2 అనేది ఐచ్చికమైనది. కంపల్సరీ కాదు. శాలరీ పొందే ఉద్యోగులు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.