సిటీ బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. డీబీఎస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 3 నుంచి 5 శాతం మధ్యలో ఉంది. డాషే బ్యాంక్‌లో వడ్డీ రేటు 3 శాతంగా ఉంది. హెచ్ఎస్బీసీలో వడ్డీ రేటు 2 నుంచి 2.5 శాతం వరకు వస్తుంది. స్కాటియా బ్యాంక్‌లో వడ్డీ రేటు 3 శాతంగా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో 3.25 శాతం నుంచి 5 శాతం వరకు వడ్డీ ఉంది.
కెనరా బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.9 శాతం నుంచి 4 శాతం వరకు లభిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 2.9 శాతం నుంచి 3 శాతం వరకు ఉంది. ఇండియన్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.75 శాతం నుంచి 2.9 శాతం వరకు లభిస్తుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.75 శాతం నుంచి 2.9 శాతం వరకు ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.7 శాతం నుంచి 3 శాతం వరకు వస్తోంది.
జే అండ్ కే బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంది. కర్నాటక బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.75 నుంచి 4.5 శాతం వరకు లభిస్తోంది. కోటక్ బ్యాంక్‌లో 3.5 నుంచి 4 శాతం వరకు వడ్డీ వస్తోంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.25 శాతం నుంచి 3.25 శాతం వరకు ఉంది. ఆర్బీఎల్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 4.25 శాతం నుంచి 6.5 శాతం వరకు వస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 2.5 నుంచి 6 శాతం వరకు ఉంది. యస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 4 శాతం నుంచి 6.35 శాతం దాకా వస్తుంది.
ఇక ఏయూ స్మాల్ ఫైనాన్స్‌లో వడ్డీ రేటు 3.5 నుంచి 7.25 శాతం వరకు ఉంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 3.5 నుంచి 7 శాతం దాకా వస్తుంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 4 నుంచి 6.25 శాతం వరకు ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వస్తోంది.