Interest on FD: సాధారణంగా టెర్మ్ డిపాజిట్ (Term Deposite) లేదా ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) మెచ్యూర్ అయిన సమయం నుంచి వడ్డీ రావడం ఆగిపోతుంది. కానీ తాజాగా మార్పులు చేసిన రూల్స్ ప్రకారం మీ టర్మ్ డిపాజిట్ మెచ్యూర్ అయినా సరే... మీరు దాన్ని క్లెయిం చేసుకునే వరకు సేవింగ్స్ అకౌంట్లో ఉన్నంత వడ్డీ మీకు వస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా తన సర్కులర్ ద్వారా తెలిపింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల గురించి జరిపిన రివ్యూలో భాగంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
టెర్మ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యాక ఒకవేళ ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఆగిపోతే ఆ మొత్తానికి బ్యాంకులు వడ్డీ చెల్లించాలని RBI చెప్పింది. సేవింగ్స్ అకౌంట్ వడ్డీ లేదా మెచ్యూర్డ్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రెండిట్లో ఏది తక్కువైతే ఆ ఆ వడ్డీ చెల్లించే వీలుంటుంది అని ఓ ప్రకటనలో తెలిపింది. (image credit - twitter - reuters)