1. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నవారు ప్రపోజల్ ఫామ్‌లో ప్రస్తుతం ఉన్న వ్యాధుల గురించి తెలియజేసినప్పుడు వారి హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌ను (Health Insurance Claim) తిరస్కరించకూడదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్ ఈ కీలక తీర్పు వెల్లడించింది. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతీ సమాచారాన్ని వెల్లడించాల్సిన బాధ్యత పాలసీ తీసుకునే వ్యక్తిపై ఉంటుందని సుప్రీం కోర్టు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తీసుకుంటున్న పాలసీ గురించి కూడా సదరు వ్యక్తి పూర్తి వాస్తవాలను తెలుసుకోవాలని తెలిపింది. అమెరికాలో తన వైద్య ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్‌ను నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ (NCDRC) తిరస్కరించడంపై మన్మోహన్ నందా అనే వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లడం కోసం మన్మోహన్ నందా ఓవర్సీస్ మెడిక్లెయిమ్ బిజినెస్ అండ్ హాలిడే పాలసీ తీసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత మూడు స్టెంట్స్ వేశారు. సదరు వ్యక్తి తన వైద్య ఖర్చుల కోసం మెడిక్లెయిమ్ ఫామ్‌ను ఇన్స్యూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. అయితే పాలసీదారుడు తనకు డయాబెటిస్ హిస్టరీ, హైపర్‌లిపిడేమియా ఉన్నట్టు పాలసీ కొనేప్పుడు వెల్లడించలేదన్న కారణంతో ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్‌ను తిరస్కరించింది. మరోవైపు ఫిర్యాదుదారుడు స్టాటిన్ మెడిసిన్ వాడుతున్నారని, ఆ విషయాన్ని పాలసీ కొనేప్పుడు వెల్లడించలేదని, పాలసీ తీసుకునే సమయంలో తన ఆరోగ్య పరిస్థితుల గురించి పూర్తిగా వెల్లడించడంలో విఫలం అయ్యాడని NCDRC అప్పీల్‌ను తిరస్కరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దీంతో పాలసీదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ పాలసీ క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధమని, చట్టానికి లోబడినది కాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆకస్మిక అనారోగ్యం లేదా ఊహించని అనారోగ్యం లేదా విదేశాల్లో సంభవించబోయే అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాలసీ తీసుకుంటారని సుప్రీం కోర్టు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. పాలసీలో మినహాయించని ఆకస్మిక అనారోగ్యం లేదా జబ్బుతో పాలసీదారుడు బాధపడితే అందుకు సంబంధించిన ఖర్చుల్ని చెల్లించాల్సిన కంపెనీ ఇన్స్యూరెన్స్ కంపెనీదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత అనారోగ్య పరిస్థితులను పాలసీదారుడు పాలసీ ప్రపోజల్ ఫామ్‌లో వెల్లడించిన తర్వాత పాలసీ క్లెయిమ్ తిరస్కరించకూడదని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీరు ఏదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకునే ముందు నియమనిబంధనలన్నీ పూర్తిగా చదివి తెలుసుకోవాలి. పాలసీ ఫామ్‌లో మీకు ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితుల గురించి తప్పనిసరిగా వెల్లడించాలి. ప్రస్తుతం ఉన్న వ్యాధుల్ని దాచిపెడితే భవిష్యత్తులో క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)