INFLATION HITS KITCHEN LEMON PRICES RISE TO RS 200 PER KG WHY PRICES ARE INCREASING MKS
Lemon Price: అమ్మో.. నిమ్మ! -4రెట్లు పెరిగిన ధర -నిమ్మకాయ కేజీ రూ.200 - మున్ముందు భారీగా
దేశంలో ధరల దెబ్బకు సామాన్యులు విలవిల్లాడుతున్నారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాలు, వంట నూనెలు, బస్సు చార్జీలు.. ఒక్కటేంటి అడుగు తీసి అడుగేస్తే రేట్ల మోత. ఈ క్రమంలోనే తానూ తక్కువకాదంటూ కన్నీళ్లు పెట్టిస్తోంది నిమ్మకాయ. వివరాలివే..
మార్కెట్లో నిమ్మకాయల రేట్లు కనీసం 4రెట్లు పెరిగియా. ప్రధాన నగరాలు, పట్టణాల్లో కిలో నిమ్మకాయల ధర రూ. 200 దాటేసింది. విడిగానైతే రూ.7 నుంచి రూ.10కి ఒక కాయ అమ్ముతున్నారు.
2/ 9
గతేడాది ఇదే సీజన్ (మార్చి)తో పోలిస్తే ప్రస్తుతం నిమ్మకాలయ ధర 4రెట్లు పెరిగింది. ద్రవ్యోల్బణం దెబ్బ వంట గదినీ తాకింది. కేజీ నిమ్మకాయలు ఏకంగా రూ. 200 పలుకుతున్నాయి.
3/ 9
నిమ్మకాయల ధర మార్చి చివరినాటికే రూ.200 దాటిదే, నడుస్తోన్న ఏప్రిల్, రాబోయే మే నెలల్లో నిమ్మ ధరలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
4/ 9
ఎండకాలం సహజంగానే నిమ్మకు డిమాండ్ పెరుగుతుంది. కానీ గతంలో ఎన్నడూ చూడనంత ధరలు ఈసారి కనిపిస్తున్నాయి. మార్కెట్లో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. నిమ్మ ధరలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటోంది.
5/ 9
జనం ఇంతకు ముందులా నిమ్మకాయలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నారు. నాణ్యతను కూడా పట్టించుకోకుండా కొనేస్తున్నారు ఇంకొందరు.
6/ 9
ఎండలు, ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు నిమ్మకాయలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. డీహైడ్రేషన్ రాకుండా నిమ్మకాయ నీళ్లు సేవిస్తుంటారు. వీటితో విటమిన్ సీ కూడా లభిస్తుంది. అందువల్ల ఎండా కాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
7/ 9
కానీ ఇప్పుడు చాలా ఊళ్లలో నిమ్మకాయలు కొనలేని పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో సరఫరా కూడా జరగడం లేదు. లోని రాజ్‌కోట్ లాంటి ఊళ్లలో నిమ్మకాయల సరఫరా దాదాపు నిలిచిపోయింది.
8/ 9
గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ముందస్తుగానే.. ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తున్నారు.
9/ 9
పెరిగిన ధరల కారణంగా తక్కువ పరిమాణంలో నిమ్మకాయల్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఉత్పత్తి పెరిగితేనే తప్ప నిమ్మకాయల ధరలు దిగివచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.