Credit Card: ఉచితంగా క్రెడిట్ కార్డు, తీసుకుంటే 53 లీటర్ల పెట్రోల్ ఫ్రీ.. బ్యాంక్ బంపరాఫర్!
Credit Card: ఉచితంగా క్రెడిట్ కార్డు, తీసుకుంటే 53 లీటర్ల పెట్రోల్ ఫ్రీ.. బ్యాంక్ బంపరాఫర్!
Bank | మీరు ఉచితంగా క్రెడిట్ కార్డు పొందాలని చూస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. బ్యాంక్ ఉచిత ఆఫర్ తీసుకువచ్చింది. ఈ కార్డు ద్వారా 53 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చు.
Free Credit Card | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. ఉచితంగానే క్రెడిట్ కార్డు అందిస్తోంది. ఈ కార్డు తీసుకోవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
2/ 10
ఈ ఉచితక్రెడిట్ కార్డు ఆఫర్ పరిమిత కాలం వరకే ఉటుంది. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా బ్యాంక్ ఈ సదుపాయం కల్పిస్తోంది. అందువ్లల ఎవరైతే క్రెడిట్ కార్డు కావాలని కోరుకుంటున్నారో.. వెంటనే బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్లి కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.
3/ 10
ఇంతకీ అది ఏ క్రెడిట్ కార్డు అని అనుకుంటున్నారా? ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఈ కార్డును ఇప్పుడు మీరు ఫ్రీగా పొందొచ్చు. ఈ కార్డు తీసుకున్న వారికి ఏడాదికి 53 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.
4/ 10
సాధారణంగా అయితే ఈ క్రెడిట్ కార్డు ఫీజు రూ. 500. జాయినింగ్ ఫీజు కింద ఈ డబ్బులు చెల్లించుకోవాలి. అలాగే వార్షిక ఫీజు కూడా రూ. 500గా ఉంది. రెండవ ఏడాది నుంచి ఈ ఫీజు చెల్లించుకుంటూ రావాల్సి వస్తుంది. అయితే ఆఫర్లో భాగంగా కార్డు తీసుకుంటే లైఫ్ టైమ్ ఫ్రీగా పొందొచ్చు.
5/ 10
18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ కార్డ కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు, ఫామ్ 60, ఫోటోలు, ఆధార్ కార్డు, పే స్లిప్స్, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. కార్డు 21 రోజుల లోగా మీకు లభిస్తుంది.
6/ 10
కార్డు తీసుకోవడం వల్ల వెల్కమ్ బెనిఫిట్ కింద 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. కారు జారీ అయిన 30 రోజులలోగా ఇది వర్తిస్తుంది. ఐఓసీఎల్ ఫ్యూయెల్ ఔట్‌లెట్స్‌లో ప్రతి రూ.100 ఖర్చుపై 20 రివార్డు పాయింట్లు పొందొచ్చు.
7/ 10
ఆన్లైన్లో షాపింగ్ చేస్తే.. ఒక శాతం వాల్యూ బ్యాక్ పొందొచ్చు. ప్రతి రూ.100 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌పై ఇన్స్టాంట్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
8/ 10
అంతేకాకుండా ఈ కార్డు తీసుకోవడం వల్ల ఏడాదికి 53 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఫ్యూయెల్ స్పెండ్స్ రూంలో ఏడాదికి రూ. 48 వేలు ఖర్చు చేస్తే.. రూ. 1920 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఫ్యూయెల్ సర్‌చార్జ్ మాఫీ కింద ఏడాదికి రూ. 480 ఆదా అవుతుంది.
9/ 10
ఆన్లైన్ షాపింగ్ కింద రూ. 36 వేలు ఖర్చు చేస్తే 360 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా బుక్ మై షో ద్వారా టికెట్ల బుకింగ్‌కు . 6 వేలు ఖర్చు చేస్తే ఏడాదికి రూ.600 ఆదా అవుతుంది. ఇతర వాటి కోసం రూ. 54 వేలు ఖర్చు చేస్తే రూ. 108 ఆదా అవుతుంది.
10/ 10
యాక్టివేషన్ బెనిఫిట్స్ కింద రూ. 250 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా వార్షికంగా రూ. 1,44,000 ఖర్చు చేస్తే.. మీకు లభించే క్యాష్ బ్యాక్ మొత్తంతో 53 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చు. ఇక్కడ లీటరు పెట్రోల్ రేటును రూ.70గా పరిగణలోకి తీసుకున్నారు.