కేంద్ర రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ రేట్ల మీద ఇచ్చే తగ్గింపును ఎత్తేసింది. ఇకపై దాన్ని పునరుద్ధరించడం లేదని ప్రకటించింది. సాక్షాత్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2020 మార్చిలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం రైలు సర్వీసులు అన్నిటినీ నిలిపివేసింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా కొన్ని సర్వీసులన పునరుద్ధరిస్తూ వచ్చింది. ఇప్పుడు దాదాపు అన్ని రైళ్ల సర్వీసులను పునరుద్ధరించింది. అయితే, కరోనా సమయంలో నడిపిన ప్రత్యేక రైళ్లలో అన్ని కన్సెషన్లను ఎత్తివేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా రైళ్లను పునరుద్ధరించిన తర్వాత మళ్లీ 2020 మార్చికి ముందు ఇచ్చిన సీనియర్ సిటిజన్ కన్సెషన్ ను మాత్రం తిరిగి ప్రారంభించలేదు. దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని అందరూ భావించారు. కానీ కేంద్ర మంత్రి మాత్రం ఇకపై దాన్ని పునరుద్ధరించబోమని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే రేట్లు 50 శాతం తక్కువగా ఉన్నాయని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
60 సంవత్సరాలు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలను కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లుగా గుర్తిస్తుంది. వారు రైలు ప్రయాణాలు చేసేటప్పుడు టికెట్ ధరల్లో రాయితీ ఇస్తుంది. పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం టికెట్ రేట్లలో రాయితీ ఉంటుంది. అన్ని మెయిల్, ఎక్స్ ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ది, జన శతాబ్ది రైళ్లలోనూ ఈ సౌకర్యం ఉండేది. కానీ ఇకపై ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
మరోవైపు ఇలా సీనియర్ సిటిజన్ల కన్సెషన్ ఎత్తవేయడం ద్వారా కేంద్ర రైల్వే శాఖకు ఎంత ఆదాయం సమకూరిందో తెలుసా. అక్షరాలా రూ.1200 కోట్లు. ఔను. 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు కన్సెషన్ తొలగించడం ద్వారా అదనంగా ఎంత ఆదాయాన్ని ఆర్జించింది అన్న విషయం తెలుసుకోవడానికి మధ్య ప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టుం ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేశారు. ఈ రెండేళ్లలో రైల్వే 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు కన్సెషన్ ఇవ్వలేదని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)