1. విశాఖపట్నం నుంచి అరకు మీదుగా కిరండూల్ (Visakhapatnam Araku Train) వెళ్లే రైలుకు ఎల్‌హెచ్‌బీ (Linke Hofmann Busch) రేక్తో పాటు మరో విస్టాడోమ్ కోచ్‌ను (Vistadome Coach) ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే (Indian Railways). ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. (image: Indian Railways)
2. ప్రస్తుతం సంప్రదాయంగా ఉన్న రైలు బోగీల స్థానంలో LHB కోచ్‌లను ఏర్పాటు చేస్తోంది భారతీయ రైల్వే. ఈ కోచ్‌లు జర్మన్ టెక్నాలజీతో తయారయ్యాయి. పాత బోగీల కన్నా ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు తక్కువగా ఉంటుంది. ఈ కోచ్‌లో ప్రయాణికులకు జర్నీ సాఫీగా సాగుతుంది. ఇటీవల చాలా రైళ్లకు దశలవారీగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేస్తోంది రైల్వే. (image: Indian Railways)
3. ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) విశాఖపట్నం నుంచి వెళ్లే ఆరు రైళ్లకు LHB కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే రైలుకు కూడా LHB కోచ్ ఏర్పాటు చేయడం విశేషం. దీంతో పాటు అరకు వెళ్లే పర్యాటకుల కోసం మరో అద్దాల బోగీ అంటే విస్టాడోమ్ కోచ్ (Vistadome Coach) అమర్చింది. (image: Indian Railways)
4. విస్టాడోమ్ కోచ్ (Vistadome Coach) విశేషాలు చూస్తే... వీటిని తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది భారతీయ రైల్వే. ప్రస్తుత బోగీలతో పోలిస్తే విస్టాడోమ్ కోచ్ చాలా విశాలంగా ఉంటుంది. పర్యాటకులు ప్రకృతి అందాలను చూసేందుకు మూడువైపులా అద్దాలు ఉంటాయి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఈ బోగీలను ఏర్పాటు చేస్తోంది రైల్వే. (image: Indian Railways)
5. విస్టాడోమ్ కోచ్‌లు పర్యాటకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. విస్టాడోమ్ కోచ్‌లోని సీట్లను 180 డిగ్రీలు తిప్పొచ్చు. ఇందులో వైఫై బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. విస్టాడోమ్ కోచ్‌లో మినీ ప్యాంట్రీ ఉంటుంది. అక్కడ కాఫీ మేకర్, బాటిల్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాష్ బేసిన్ లాంటివి ఉంటాయి. కోచ్‌లల్లో సీసీటీవీ నిఘా కూడా ఉంటుంది. (image: Indian Railways)
6. అరకుకు శీతాకాలంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారిని దృష్టిలో పెట్టుకొని మరో అద్దాల బోగీని అమర్చింది భారతీయ రైల్వే. అరకు వెళ్లే పర్యాటకులు 18551 నెంబర్ గల రైలులో టికెట్లు బుక్ చేసుకుంటే అద్దాల రైలులో ప్రయాణించొచ్చు. ఇందుకోసం ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ టికెట్స్ బుక్ చేయాలి. టికెట్ ధర రూ.670. (image: Indian Railways)