2. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 128 వీల్స్ మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని జలమార్గంలో తీసుకొచ్చే పరిస్థితి లేదు. వాటిని వాయుమార్గం ద్వారా తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మే మూడో వారంలో 128 వీల్స్‌ని వాయుమార్గం ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి మిగతా వీల్స్ పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. భారత ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను నడుపుతామని ప్రకటించింది. 2023 ఆగస్ట్ నాటికి 75 సెమీ హైస్పీడ్ రైళ్లు దేశంలోని ప్రధాన రూట్లలో అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఆర్డర్ చేసిన వీల్స్ సమయానికి వస్తేనే ఇది సాధ్యం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఉక్రెయిన్ నుంచి వీల్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది భారతీయ రైల్వే. చక్రాలు తయారు చేసే బాధ్యతల్ని చెక్ రిపబ్లిక్, పోలండ్, అమెరికా దేశాల్లోని సంస్థలకు అప్పగించినట్టు మొదట వార్తలొచ్చాయి. అయితే వందే భారత్ రైళ్లకు మేడ్ ఇన్ ఇండియా వీల్స్ ఉపయోగించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు కావాల్సిన 60-70 శాతం వీల్స్‌ని దిగుమతి చేసే ఆలోచనలో ఉంది. మిగతా వీల్స్ ఇండియాలోనే తయారవుతాయి. ఇప్పటికే యెలహంకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ చక్రాల తయారీకి కావాల్సిన పార్ట్స్ కోసం టెండర్స్‌ని ఆహ్వానించింది. రెండు మూడు నెలల్లో చక్రాల తయారీ పూర్తవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రపంచంలో వీల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు 20 మాత్రమే ఉన్నాయి. వీల్స్ ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్ ప్రధానమైనది. ప్రస్తుతం యుద్ధం కారణంగా చక్రాల ఎగుమతి నిలిచిపోయింది. భారతదేశం ఆర్డర్ చేసిన చక్రాల్లో 128 సిద్ధంగా ఉన్నాయి. వాటిని రొమేనియాకు ట్రక్కుల్లో తరలించి, అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయనుంది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
8. రొమేనియా నుంచి నేరుగా చెన్నైకి వందే భారత్ రైళ్ల వీల్స్ చెన్నైకి వస్తాయి. వాటిని అక్కడే రైళ్లకు అమరుస్తారు. 2023 ఆగస్ట్ 15 నాటికి 75 వందేభారత్ రైళ్లను నడపనుంది భారతీయ రైల్వే. 2019లో తొలి వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-కాట్రా రూట్స్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రత్యేకమైన ఫీచర్స్, సదుపాయాలు ఉంటాయి. మెట్రో రైళ్లల్లో ఉన్నట్టుగా ఫుల్లీ ఆటోమెటిక్ డోర్లు, ఏసీ కోచ్‌లు ఉంటాయి. 180 డిగ్రీలు తిరిగే రివాల్వింగ్ చైర్లు ఉంటాయి. ఈ రైలులో బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, ఇతర హైటెక్ ఫీచర్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)