1. భారతీయ రైల్వే (Indian Railways) దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను (Secunderabad Railway Station) ఆధునిక హంగులతో పునరాభివృద్ధి చేయనుంది భారతీయ రైల్వే. ఇందుకోసం రూ.669 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. (image: Indian Railways)
2. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మూడేళ్లలో పునరాభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ రైల్వే. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్ సబ్ అర్బన్ గ్రేడ్ 1 (NSG1) స్టేషన్‌గా గుర్తించిన ఏకైక రైల్వే స్టేషన్ ఇదే కావడం విశేషం. ఏటా 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తూ, రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వే స్టేషన్లు NSG1 పరిధిలోకి వస్తాయి. (image: Indian Railways)
3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం 200 రైళ్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటాయి. రోజూ 1.8 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలతో ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. మూడేళ్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా మారిపోనుందో గ్రాఫిక్స్ కూడా విడుదల చేసింది. ట్విట్టర్లో భారతీయ రైల్వే పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. (image: Indian Railways)
5. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందించడానికి స్టేషన్ కాంప్లెక్స్‌ను ఇంటిగ్రేట్ చేస్తూ ఓ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. G + 3 అంతస్తులతో ఉత్తరం వైపు ఒక స్టేషన్ భవనం, దక్షిణం వైపు మరో భవనం నిర్మించనుంది. రెండు అంతస్తుల స్కై కన్కోర్స్ కూడా నిర్మించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైల్వే స్టేషన్‌కు ఉత్తరం వైపు మల్టీ-లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తుంది. దక్షిణం వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ఉత్తరం, దక్షిణం భవనాల దగ్గర ట్రావెలేటర్లతో పాటు 7.5 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేలా రెండు నడక మార్గాలను నిర్మించనుంది. ఇక ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)