Vistadome Train: ఈ అద్దాల రైలులో ప్రయాణం... అదిరిపోవడం ఖాయం
Vistadome Train: ఈ అద్దాల రైలులో ప్రయాణం... అదిరిపోవడం ఖాయం
Vistadome Train | రైలు ప్రయాణం ఇష్టపడేవారికి గుడ్ న్యూస్. ప్రయాణికులకు రైలు ప్రయాణ అనుభూతిని చిరకాలం గుర్తుండేలా చర్యలు తీసుకుంటోంది భారతీయ రైల్వే. అందులో భాగంగా సరికొత్త రైలును అందుబాటులోకి తీసుకురానుంది. అసలు ఆ రైలు ఎలా ఉందో చూడండి.
1. భారతీయ రైల్వే విస్టాడోమ్ కోచ్‌లను తయారు చేస్తోంది. ఈ రైలులో ప్రయాణం... అదిరిపోవడం ఖాయం. ఎన్నో అత్యాధునికమైన హంగులతో ఈ రైలు తయారవుతోంది. ఈ రైలుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను భారతీయ రైల్వే ట్విట్టర్లో పోస్ట్ చేసింది. (image: Indian Railways)
2/ 9
2. విస్టాడోమ్ కోచ్‌ను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. సరికొత్త టెక్నాలజీ, అత్యాధునికమైన సదుపాయాలతో రూపొందించిన ఈ రైలులో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ అన్నారు. (image: Indian Railways)
3/ 9
3. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా విస్టాడోమ్ కోచ్‌లను చూసి భారతీయ రైల్వేను ప్రశంసించారు. ప్రయాణాన్ని మైళ్ల లెక్కన కాకుండా జ్ఞాపకాల లెక్కన గుర్తుంచుకోవాలన్న మాటను ఈ కోచ్ నిజం చేస్తుందని పీయూష్ గోయల్ అన్నారు. (image: Indian Railways)
4/ 9
4. భారతీయ రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ విస్టాడోమ్ కోచ్‌ను తయారు చేసింది. మొదటిసారిగా ఎల్‌హెచ్‌బీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కోచ్‌ను తయారు చేసింది భారతీయ రైల్వే. విస్టాడోమ్ కోచ్ ఇటీవలే ట్రయల్స్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం. (image: Indian Railways)
5/ 9
5. విస్టాడోమ్ కోచ్ ప్రత్యేకతలు చూస్తే ఈ కోచ్ విశాలంగా ఉంటుంది. రూఫ్ టాప్ గ్లాస్‌తో ఉంటుంది. ఒక కోచ్‌లో 44 సీట్లు ఉంటాయి. ఈ సీట్లను 180 డిగ్రీలు తిప్పేయొచ్చు. అదే ఈ సీట్ల ప్రత్యేకత. విస్టాడోమ్ కోచ్‌లో వైఫై బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. (image: Indian Railways)
6/ 9
6. ప్రతీ సీటుకు స్క్రీన్ ఉంటుంది. ప్రయాణికులు తమ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ ఉపయోగించి వైఫై ద్వారా తమకు కావాల్సిన కంటెంట్ చూడొచ్చు. మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. (image: Indian Railways)
7/ 9
7. విస్టాడోమ్ కోచ్‌లో మినీ ప్యాంట్రీ ఉంటుంది. అక్కడ కాఫీ మేకర్, బాటిల్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాష్ బేసిన్ లాంటివి ఉంటాయి. కోచ్‌లల్లో సీసీటీవీ నిఘా కూడా ఉంటుంది. (image: Indian Railways)
8/ 9
8. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తుతం 10 కోచ్‌లను తయారు చేస్తోంది. ఇందులో రెండు అందుబాటులోకి వచ్చాయి. మిగతావి 2021 మార్చి 31 లోగా రెడీ అవుతాయి. పర్యాటక ప్రాంతాల్లో ఈ రైళ్లను నడపుతోంది భారతీయ రైల్వే. ఇప్పటికే అరకులో విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉంది. (image: Indian Railways)
9/ 9
9. అరకు వ్యాలీతో పాటు కాశ్మీర్ లోయ, డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే, కల్క షిమ్లా రైల్వే, నీల్గిరి మౌంటైన్ రైల్వే లాంటి ప్రాంతాల్లో ఈ విస్టాడోమ్ కోచ్‌లు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. (image: Indian Railways)