1. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ రైలు నడుస్తోంది. త్వరలో సికింద్రాబాద్-తిరుపతి రూట్లో కూడా వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఆగస్ట్ 15 నాటికి 75 వందే భారత్ రైళ్లు, రాబోయే మూడు నాలుగేళ్లల్లో 400 వందే భారత్ రైళ్లను నడపాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. (ప్రతీకాత్మక చిత్రం)
2. వందే భారత్ రైళ్లతో పాటు త్వరలో వందే మెట్రో రైళ్లు కూడా రానున్నాయి. ఇవి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మినీ వర్షన్. వందే మెట్రో రైళ్ల తయారీ ఈ ఏడాది పూర్తవుతుంది. వచ్చే ఏడాది వందే మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. వందే మెట్రో సేవలు పెద్ద నగరాల్లోని ప్రజలకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైల్వే ప్రయాణికులు ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేయడానికి, స్వస్థలాలకు వెళ్లడానికి వందే మెట్రో రైళ్లు సేవలు అందిస్తాయి. రాష్ట్రంలోని సమీప ప్రాంతాల ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ప్రధాని మోదీ విజన్ ప్రకారం పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడిన వందే మెట్రో రైళ్లు త్వరలో వస్తాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. వందే మెట్రోను అభివృద్ధి చేస్తున్నామని, పెద్ద నగరాల చుట్టూ, పెద్ద నివాస ప్రాంతాలు ఉన్నాయని, ప్రజలు తమ పని కోసం లేదా విశ్రాంతి కోసం పెద్ద నగరానికి వచ్చి తమ స్వస్థలానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నారని, వారికి వందే భారత్తో సమానమైన వందే మెట్రోతో ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. వందే మెట్రో రైళ్ల ఫీచర్స్ చూస్తే సెమీ-హై స్పీడ్ వెర్షన్ను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ రైళ్లలో మెట్రో రైలు లాగా ఎనిమిది కోచ్లు ఉంటాయి. వందే భారత్ మెట్రో ప్రయాణికులకు వేగవంతమైన షటిల్ లాంటి అనుభూతిని కలిగిస్తుంది. ప్రజలు తమ స్వస్థలాల నుంచి పెద్ద నగరాల్లోని కార్యాలయాలకు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వందే మెట్రోను అభివృద్ధి చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో 16 కోచ్లు ఉంటాయి. కానీ వందే మెట్రో రైళ్లల్లో 8 కోచ్లు మాత్రమే ఉంటాయి. వీటిని త్వరగా ప్రారంభించాలని చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO) జనరల్ మేనేజర్లను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)