1. భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ తొలి వందే భారత్ రైలును నడపనుంది. ఇటీవల దక్షిణాదికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. (image: Indian Railways)
3. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. వందే భారత్ రైలును నడపడానికి భారతీయ రైల్వే రెండు రూట్లను పరిశీలిస్తోంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ రైలు నడిపేందుకు టెక్నికల్ క్లియరెన్స్ వచ్చిందని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి వరకు వందే భారత్ రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డును కోరినట్టు వివరించారు. (image: Indian Railways)
4. భారతీయ రైల్వే క్లియరెన్స్ వస్తే మొదట సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇదే రైలును తిరుపతి వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇక భారతీయ రైల్వే వందే భారత్ రైలును నడిపేందుకు మరో రూట్‌ను కూడా పరిశీలిస్తోంది. వచ్చే నెలలోనే వైజాగ్ నుంచి వందే భారత్ రైలు సికింద్రాబాద్ రూట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. (image: Indian Railways)
5. ఈ రూట్లో వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు 12 నుంచి 14 గంటల ప్రయాణం కాకుండా కేవలం 8 గంటల్లో ప్రయాణించవచ్చు. అయితే మొదట విశాఖపట్నం నుంచి విజయవాడకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించనుంది రైల్వే. (image: Indian Railways)
6. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ రైలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సత్పతి కూడా ఈ ఏడాదిలోనే వైజాగ్ నుంచి వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుందని చెప్పడం విశేషం. ఇప్పటికే వాల్తేర్ డివిజన్ సిబ్బంది వందే భారత్ రైలును నడపడానికి కావాల్సిన శిక్షణ కూడా తీసుకున్నారని తెలిపారు. (image: Indian Railways)