1. తెలుగు రాష్ట్రాలకు డిసెంబర్ చివరి వారంలోగా వందే భారత్ రైలు (Vande Bharat Train) అందుబాటులోకి వస్తుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ కాస్త ఆలస్యంగా ఈ రైలు తెలుగు రాష్ట్రాలకు రానుందని తాజా సమాచారం. 2023 ఫిబ్రవరి లోగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పబ్లిష్ చేసింది. (image: Indian Railways)
2. ఆ కథనం ప్రకారం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు 2023 ఫిబ్రవరి లోగా అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్‌ను నడపాలన్న ప్రతిపాదనకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో వందే భారత్ రైలు నడిపేందుకు టెక్నికల్ క్లియరెన్స్ వచ్చిందని గత నెలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలిపారు. (image: Indian Railways)
3. అయితే ఈ రైలును విశాఖపట్నం వరకు పొడిగిస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య రైలు నడపడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనుంది రైల్వే. ఇక వందే భారత్ రైలు వరంగల్, విజయవాడ, రాజమండ్రి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనుంది. (image: Indian Railways)
4. ప్రస్తుతం న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైళ్లను ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశాలున్నాయి. (image: Indian Railways)
5. రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను నడిపే ఆలోచనలో ఉంది రైల్వే. ప్రధాన నగరాలు, పట్టణాలను వందే భారత్ రైళ్లు కనెక్ట్ చేస్తాయి. అదే జరిగితే హైదరాబాద్ కూడా వందే భారత్ రైళ్లకు ప్రధాన హబ్‌గా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మరిన్ని నగరాలకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. (image: Indian Railways)