1. భారతదేశంలో ప్రస్తుతం 8 రూట్లల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. న్యూఢిల్లీ- వారణాసి, న్యూఢిల్లీ- కాట్రా, గాంధీనగర్- ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ- అంబ్ అందౌర, చెన్నై- మైసూరు, బిలాస్పూర్-నాగ్పూర్, హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ నెలలోనే మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఫిబ్రవరి 10న ముంబై-షిరిడీ, ముంబై-సోలాపూర్ రూట్లలో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి రూట్లో కూడా వందే భారత్ రైలు ఫిబ్రవరిలోనే ప్రారంభం కానుందన్న వార్తలొస్తున్నాయి. త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు రూట్లో కూడా వందే భారత్ రైలు సేవలు అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. నాలుగు ఫ్యాక్టరీల్లో వందే భారత్ రైళ్లను ఏకకాలంలో ఉత్పత్తి చేస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి వారం రెండు లేదా మూడు వందే భారత్ రైళ్లను నడిపించగలిగేలా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నామని, వందేభారత్ రైళ్ల ద్వారా ప్రతి ప్రధాన నగరం, చిన్న పట్టణాలను కవర్ చేయాలనే ప్రధాన మంత్రి ఆశయాన్ని ఇది నెరవేరుస్తుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ లెక్కన త్వరలో వారానికి రెండు మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. తమ ప్రాంతానికి వందే భారత్ రైలు కావాలని ప్రతీ రైల్వే జోన్ నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఆ డిమాండ్లను నెరవేర్చడానికి భారతీయ రైల్వే వందే భారత్ రైళ్ల ఉత్పత్తిని పెంచుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వారానికి మూడు వందే భారత్ రైళ్లు తయారవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మొదట వందే భారత్ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారయ్యేవి. హర్యానాలోని సోనిపత్, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, మహారాష్ట్రలోని లాథూర్లో కూడా వీటిని తయారు చేసేందుకు ఇప్పటికే భారతీయ రైల్వే కసరత్తు మొదలువెట్టింది. ప్రస్తుతం వారానికి ఒక వందే భారత్ రైలు తయారు చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర బడ్జెట్లో రైల్వేకు రూ.2.40 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రైల్వేకు అత్యధిక కేటాయింపులు ఇవి. రాబోయే మూడేళ్లల్లో 500 వందే భారత్ రైళ్ల ఉత్పత్తికి ఆమోదం లభించింది. కాబట్టి ప్రధాన నగరాలు, పట్టణాలను కలిపే రూట్లలో త్వరలో వందే భారత్ రైళ్లు తిరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)