"100 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు వందే మెట్రోరైలు, 100 నుంచి 550 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు వందే ఛైర్ కార్, అలాగే... 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణాలకు వందే స్లీపర్ రైళ్లు రానున్నాయి. ఈ మూడు రకాల రైళ్లూ వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చి నాటికి రెడీ అవుతాయి" అని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఈ రైళ్ల వేగాన్ని కూడా పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అలా జరగాలంటే.. ప్రస్తుతం ఉన్న పట్టాల స్థానంలో కొత్తవి రావాల్సి ఉంది. ఇప్పుడు ఉన్నవి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలుగుతున్నాయి. కొత్త ట్రాకులు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకునేలా తయారుచేస్తున్నారు. మరో మూడేళ్ల తర్వాత అవి అందుబాటులోకి రానున్నాయి.
రైళ్లలో ప్రయాణికులకు 4జీ, 5జీ సేవల్ని కూడా త్వరలోనే తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని... ఆనంద్ విహార్ వరకు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించిన తర్వాత PTIతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది జూన్ మధ్య నాటికి అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు అందుబాటులో ఉంటుందన్నారు.