1. భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అనేక కొత్తకొత్త ప్రాజెక్టుల్ని చేపడుతోంది. అభివృద్ధి పనులు చేస్తోంది. అంతేకాదు... ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా నాన్ ఫేర్ రెవన్యూ అంటే ఛార్జీలు కాని ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ప్రయత్నంలో భాగంగా రైల్వే స్టేషన్ల కో-బ్రాండింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ పాలసీ కింద ఒక రైల్వే స్టేషన్‌ను ఒక బ్రాండ్ సొంతం చేసుకోవచ్చు. అంటే ఆ రైల్వే స్టేషన్లో ఆ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా భారతీయ రైల్వేకు అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైల్వే స్టేషన్ పేరు ముందు లేదా చివర్లో ఆ బ్రాండ్ పేరు కూడా కనిపిస్తుంది. కేవలం రెండు పదాలు ఉన్న బ్రాండ్స్‌కు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ఇది కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని, రైల్వే స్టేషన్ పేరు మార్చడం లక్ష్యం కాదని పశ్చిమ రైల్వే వివరణ కూడా ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అయితే పబ్లిక్ రిజర్వేషన్ సిస్టమ్, రైల్వే టికెట్స్, రూట్ మ్యాప్స్, వెబ్‌సైట్స్, అనౌన్స్మెంట్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, రైల్ డిస్ప్లే నెట్వర్క్ లాంటివాటిలో రైల్వే స్టేషన్ పేరు మాత్రమే ఉంటుంది. బ్రాండ్ పేరు ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలు తమ బ్రాండ్ పేరును అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైలు బోగీలను సుందరంగా తీర్చిదిద్ది బోగీ లోపల్ హోటల్ నిర్వహిస్తుంటారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లో, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నాగ్‌పూర్, రైల్వే స్టేషన్లలో 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' చూడొచ్చు. డైన్ ఇన్ రెస్టారెంట్‌తో పాటు టేక్ అవే సేవల్ని కూడా అందిస్తుంటాయి 'రెస్టారెంట్ ఆన్ వీల్స్'. (ప్రతీకాత్మక చిత్రం)
7. 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' ద్వారా భారతీయ రైల్వేకు అదనపు ఆదాయం లభిస్తోంది. ప్రైవేట్ సంస్థలతో కలిసి వీటిని నిర్వహిస్తోంది. ప్రతీ రెస్టారెంట్ ద్వారా ప్రతీ ఏటా రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని భారతీయ రైల్వే అంచనా. మరిన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ఈ రెస్టారెంట్స్ అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)