1. భారతీయ రైల్వే ప్రయాణికులకు 9వ వందే భారత్ రైలు (Vande Bharat Train) అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశంలోని 8 రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సంక్రాంతి రోజున సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో 8వ వందే భారత్ రైలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో 9వ వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుతం భారతదేశంలో వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్న రూట్లు చూస్తే 2019లో న్యూఢిల్లీ- వారణాసి రూట్లో మొదటి వందే భారత్ రైలు ప్రారంభం అయింది. అదే ఏడాది న్యూఢిల్లీ- కాట్రా రూట్లో రెండో వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక గతేడాది నుంచి వరుసగా వందే భారత్ రైళ్లు ప్రారంభం అవుతున్నాయి. గాంధీనగర్- ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ- అంబ్ అందౌర, చెన్నై- మైసూరు, బిలాస్పూర్-నాగ్పూర్, హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 8 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఫిబ్రవరిలో 9వ వందే భారత్ రైలు ప్రారంభం అవుతుందని అనుకుంటున్నా, ఏ రోజున ప్రారంభోత్సవం ఉంటుందో స్పష్టత లేదు. ఏఏ స్టేషన్లలో వందే భారత్ రైలు ఆగుతుందో కూడా తెలియాల్సి ఉంది. ఈ రైలు పూరీ నుంచి భువనేశ్వర్ మీదుగా హౌరా వెళ్తుంది. కోణార్క్, పూరీ జగన్నాథ్ ఆలయాలను చూసేందుకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు వందే భారత్ రైలు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయన్న వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, పూణె రూట్లలో మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ రూట్లో ప్రయాణించే రైల్వే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కాబట్టి వారికి వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)