1. భారతీయ రైల్వే రూపురేఖలు మారబోతున్నాయి. ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే టైమింగ్స్ సరిగ్గా ఉండవని, రైలు ఎన్ని గంటలు ఆలస్యంగా వస్తుందో తెలియదన్న అభిప్రాయం ఉండేది. రైల్వే టైమింగ్స్‌పై జోకులు కూడా ఉండేవి. కానీ... ఇప్పుడు భారతీయ రైల్వే ప్రయాణికులకు సేవలు అందించడంలో అనేక మార్పులు చేస్తోంది. అందులో భాగంగా హైస్పీడ్ రైల్ కారిడార్లను నిర్మిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. నేషనల్ రైల్ ప్లాన్‌లో భాగంగా భారతీయ రైల్వే మరో నాలుగు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను నిర్మించబోతోంది. ఈ నాలుగు కారిడార్ల ద్వారా నిర్మాణం కాబోయే హైస్పీడ్ రైల్ నెట్వర్క్ దేశంలోని మొత్తం 9 పట్టణాలను కలుపుతుంది. ఇందులో హైదరాబాద్ కూడా ఉండటం విశేషం. దీంతో హైదరాబాద్ నుంచి రెండు రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 618 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను నిర్మించనుంది భారతీయ రైల్వే. ఇక నాగ్‌పూర్ నుంచి వారణాసికి 855 కిలోమీటర్లు, పాట్నా నుంచి గువాహతికి అమృత్సర్, పఠాన్‌కోట్, జమ్మూ ప్రాంతాలను కలుపుతూ 190 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణం కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ నాలుగు రూట్లు కొత్తగా ప్రతిపాదించినవి. ఇప్పటికే నేషనల్ రైల్ ప్లాన్‌లో భాగంగా ఎనిమిది రూట్లకు పనులు మొదలయ్యాయి. హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ద్వారా దేశంలోని ప్రధాన పట్టణాలను కలపాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఇప్పటికే మంజూరైన బుల్లెట్ రైల్ కారిడార్లు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేల రూట్లలోనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. భారతదేశంలో మొట్ట మొదటి హైస్పీడ్ రైల్ కారిడార్ ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉంది. మొత్తం 508 కిలోమీటర్ల దూరాన్ని ఈ కారిడార్ కవర్ చేస్తోంది. ఈ కారిడార్ కోసం ప్రభుత్వం రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ మాత్రమే కాదు... ఇతర హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుల పనుల్ని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చూస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ 2026-27 సంవత్సరం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ కారిడార్‌పై హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు దూసుకెళ్తాయి. ముంబై-అహ్మదాబాద్ రూట్‌తో పాటు ఢిల్లీ-వారణాసి రూట్లో 958 కిలోమీటర్లు, లక్నో-అయోధ్య రూట్లో 123 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ముందే మంజూరు చేసిన రూట్లలో ముంబై-హైదరాబాద్ మధ్య 711 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా ఉంది. దీంతో పాటు ఢిల్లీ-అహ్మదాబాద్ రూట్లో 886 కిలోమీటర్లు, ఢిల్లీ-అమృత్సర్ రూట్లో 480 కిలోమీటర్లు, వారణాసి-హౌరా రూట్లో 760 కిలోమీటర్లు, చెన్నై-మైసూర్ రూట్లో 435 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)