1. భారతీయ రైల్వే 2019లో వందే భారత్ రైలును పట్టాలెక్కించింది. ప్రస్తుతం రెండు రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (Vande Bharat Express Trains) అందుబాటులో ఉన్నాయి. 40 పట్టణాలను కనెక్ట్ చేస్తూ వందే భారత్ రైళ్లు నడపనున్నట్టు భారతీయ రైల్వే గతంలోనే ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే రైళ్లను తయారు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. వందే భారత్ రైలులో ఉపయోగించే వీల్స్‌ను తయారు చేసే బాధ్యతను ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు అప్పగించింది భారతీయ రైల్వే. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో వేల సంఖ్యలో వీల్స్ దిగుమతి నిలిచిపోయింది. అందులో 128 వీల్స్‌ని ఉక్రెయిన్ సమీపంలోని రొమేనియాకు రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అక్కడ్నుంచి వాయుమార్గం ద్వారా ఈ వీల్స్‌ని ఇండియాకు తీసుకురావాలని భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 75 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాన రూట్లలో లాంఛ్ చేసేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఇందుకోసం వీల్స్ తయారు చేసే ఆర్డర్స్‌ని చెక్ రిపబ్లిక్, పోలండ్, అమెరికా దేశాల్లోని సంస్థలకు అప్పగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. చైనా నుంచి కూడా వీల్స్ దిగుమతి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వీల్స్ సరఫరాలో ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన ఉక్రెయిన్ కొత్త ఉత్పత్తిని ఆపివేసింది. రష్యా దాడి కారణంగా వీల్స్ తయారీ నిలిచిపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు 16 మిలియన్ డాలర్ల విలువైన 36,000 వీల్స్ తయారీ ఆర్డర్ ఇచ్చింది భారతీయ రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులతో ఈ వీల్స్ తయారీ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. సిద్ధంగా ఉన్న వీల్స్‌ని వాయుమార్గం ద్వారా ఇండియాకు తెప్పించాలని భారత ప్రబుత్వం భావిస్తోంది. డెలివరీ జరిగిన తర్వాత లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా చెల్లింపులు చేయనుంది ప్రభుత్వం. వాస్తవానికి ఉక్రెయిన్ బ్లాక్ సీ పోర్ట్ నుంచి మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు వీల్స్ షిప్లో రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం 128 వీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాయుమార్గం ద్వారా తీసుకొచ్చేందుకు రైల్వే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అవి రాగానే వచ్చే నెలలో నిర్వహించాల్సిన ట్రయల్స్ అనుకున్నట్టుగానే జరుగుతాయి. వందే భారత్ రైళ్ల తయారీలో ఎలాంటి ఆలస్యం లేదని రైల్వే బోర్డ్ సీఈఓ, ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను నడుపుతామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం రూ.40,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-కాట్రా రూట్స్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రత్యేకమైన ఫీచర్స్, సదుపాయాలు ఉంటాయి. మెట్రో రైళ్లల్లో ఉన్నట్టుగా ఫుల్లీ ఆటోమెటిక్ డోర్లు, ఏసీ కోచ్‌లు ఉంటాయి. 180 డిగ్రీలు తిరిగే రివాల్వింగ్ చైర్లు ఉంటాయి. ఈ రైలులో బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, ఇతర హైటెక్ ఫీచర్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)