1. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో రైలు బోగీని రెస్టారెంట్‌గా మార్చేసింది భారతీయ రైల్వే. జబల్పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నెంబర్ 6 లో కొత్తగా రెస్టారెంట్ ఆన్ వీల్స్ (Restaurant on Wheels) ప్రారంభమైంది. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని జబల్పూర్ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్లో ఈ రెస్టారెంట్ ఆన్ వీల్స్ చూడొచ్చు. (image: Indian Railways)
2. ఇదే కాదు... భారతీయ రైల్వే ఇలా చాలా రైల్వే స్టేషన్లలో బోగీలను రెస్టారెంట్లుగా మారుస్తోంది. ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల్ని ఆకట్టుకోవడంలో భాగంగా ఇండియన్ రైల్వేస్ చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ప్రైవేట్ సంస్థలతో కలిసి ఈ కాన్సెప్ట్‌ను అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తోంది రైల్వే. (image: Indian Railways)
3. ఈ ప్రాజెక్టులో భాగంగా పూణె రైల్వే డివిజన్లో నాలుగు రైల్వే స్టేషన్లలో త్వరలో రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభం కానున్నాయి. చించ్వాడ్, బారామతి, అకుర్ది, మీర్జా రైల్వే స్టేషన్లలో ఈ రెస్టారెంట్స్ ప్రారంభం అవుతాయి. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైంది. ప్రయాణానికి పనికిరాని బోగీలను సుందరంగా తీర్చిదిద్ది బోగీలుగా మార్చేస్తోంది. (image: Indian Railways)
4. గతేడాది అక్టోబర్‌లో ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో కూడా రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇంటీరియర్ డిజైన్ రైల్ థీమ్‌తో ఉంటుంది. కళ్లు చెదిరే లైటింగ్, ఫ్యాన్లు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ ప్రత్యేకతను తెలిపే పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ రెస్టారెంట్లో 10 టేబుల్స్ ఉంటాయి. 40 మంది కూర్చోవచ్చు. పర్యాటకులు హోటల్‌గా మారిన బోగీని చూసి ఆనందించడం మాత్రమే కాదు... రకరకాల వంటకాలను కూడా రుచి చూడొచ్చు. (image: Indian Railways)
5. భారతీయ రైల్వే తొలిసారిగా అసన్సోల్ డివిజన్లో మొదటి రెస్టారెంట్ ఆన్ వీల్స్‌ను ప్రారంభించింది. 2020 లో ప్రారంభించిన ఈ రెస్టారెంట్‌కు క్రేజ్ రావడంతో ఈ కాన్సెప్ట్‌ని ఇతర ప్రాంతాలకు కూడా పరిచయం చేస్తోంది. పర్యాటకుల్ని ఆకట్టుకోవడంతో పాటు, అదనంగా ఆదాయం సమకూర్చుకోవడం ఈ కాన్సెప్ట్ లక్ష్యం. (image: Indian Railways)
6. రెస్టారెంట్ ఆన్ వీల్స్ ద్వారా ఏటా రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని భారతీయ రైల్వే అంచనా వేస్తోంది. రెస్టారెంట్ ఆన్ వీల్స్ నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పగిస్తోంది రైల్వే. ఐదేళ్ల పాటు ఈ రెస్టారెంట్ నిర్వహించేందుకు కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. నిర్వహణ బాధ్యతలు మాత్రమే ప్రైవేట్ చేతులో ఉంటాయి. రెస్టారెంట్ ఇండియన్ రైల్వేస్ ఆధీనంలో ఉంటుంది. (image: Indian Railways)
7. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ డివిజన్లో ఇలాంటి రెస్టారెంట్ ఉండటం విశేషం. కొద్ది రోజుల క్రితం ముంబైలో రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభమైతే ఇప్పుడు జబల్పూర్ రైల్వే స్టేషన్లో కూడా ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. త్వరలో ఇలాంటి రెస్టారెంట్లను మరిన్ని రైల్వే స్టేషన్లలో చూడొచ్చు. (image: Indian Railways)