రైలులో ప్రయాణించే వృద్ధులకు ఇది నిజంగా చేదువార్త. కరోనా మహమ్మారికి ముందు రైలు ఛార్జీలలో ఏ రకమైన రాయితీ వర్తించేదో.. అందుకోసం వాళ్లు మరింత ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఛార్జీల రాయితీపై విధించిన ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంట్‌కు తెలియజేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం రైల్వే మూడు కేటగిరీల ప్రయాణికులకు ఛార్జీలలో రాయితీపై నిషేధాన్ని ఎత్తివేసింది. వీరిలో నాలుగు రకాల దివ్యాంగులు, 11 రకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులు, విద్యార్థులు ఉన్నారు. కరోనా కారణంగా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపిందన్న రైల్వేమంత్రి.. ఇది రైల్వే ఆదాయాలపై కూడా ప్రభావం చూపిందని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకుల ఛార్జీల నుండి రైల్వే ఆదాయాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఛార్జీల రాయితీ వల్ల రైల్వేపై పెనుభారం పడుతుందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో సీనియర్ సిటిజన్లతో సహా కొన్ని ఇతర వర్గాల ప్రయాణికులకు ఛార్జీల రాయితీపై పరిమితి కొనసాగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)